iDreamPost
android-app
ios-app

IPL హిస్టరీలోనే అరుదైన రికార్డు.. ఇన్ని సీజన్లలో ఇదే ఫస్ట్ టైమ్!

  • Published Apr 04, 2024 | 8:19 AM Updated Updated Apr 04, 2024 | 8:19 AM

ఐపీఎల్ 17వ సీజన్​లో పాత రికార్డులకు మూడింది. వరుసగా ఒక్కో అరుదైన రికార్డు బ్రేక్ అవుతూ పోతోంది. ఢిల్లీ-కోల్​కతా మ్యాచ్​లోనూ మరో అరుదైన ఘనత నమోదైంది.

ఐపీఎల్ 17వ సీజన్​లో పాత రికార్డులకు మూడింది. వరుసగా ఒక్కో అరుదైన రికార్డు బ్రేక్ అవుతూ పోతోంది. ఢిల్లీ-కోల్​కతా మ్యాచ్​లోనూ మరో అరుదైన ఘనత నమోదైంది.

  • Published Apr 04, 2024 | 8:19 AMUpdated Apr 04, 2024 | 8:19 AM
IPL హిస్టరీలోనే అరుదైన రికార్డు.. ఇన్ని సీజన్లలో ఇదే ఫస్ట్ టైమ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్​లో చాలా పాత రికార్డులకు మూడింది. ఒక రికార్డు బ్రేక్ అయ్యిందనుకునే లోపే మరో రికార్డు బద్దలవుతోంది. బౌండరీలు, సిక్సుల దగ్గర నుంచి భారీ స్కోర్ల వరకు చాలా విషయాల్లో అరుదైన ఘనతలకు ఈ సీజన్ సాక్ష్యంగా నిలుస్తోంది. సన్​రైజర్స్ హైదరాబాద్​ లీగ్​లో హయ్యెస్ట్ స్కోర్ కొట్టి వారం కూడా కాలేదు. అప్పుడే ఆ రికార్డుకు చేరువలో వచ్చి సంచలనం సృష్టించింది కోల్​కతా నైట్ రైడర్స్. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఏకంగా 272 పరుగులు చేసింది కేకేఆర్. కొంచెంలో ఎస్​ఆర్​హెచ్​ రికార్డు సేఫ్ అయింది. లీగ్ హిస్టరీలో ఇదే సెకండ్ హయ్యెస్ట్ టీమ్ స్కోర్ కావడం విశేషం. అలాగే మరో రికార్డును కూడా ఆ జట్టు తమ ఖాతాలో వేసుకుంది.

ఐపీఎల్​లో మరో అద్భుతమైన రికార్డు నమోదైంది. ఈ సీజన్​లో రెండు సార్లు 250కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో సన్​రైజర్స్​, ఢిల్లీతో మ్యాచ్​లో కోల్​కతా ఈ ఫీట్​ను నమోదు చేశాయి. ఇలా ఒకే సీజన్​లో రెండు సార్లు 250కి పైగా స్కోర్లు చేయడం లీగ్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. ఇక, డీసీతో జరిగిన మ్యాచ్​లో కేకేఆర్ 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగుల భారీ స్కోరు చేసింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85), అంగ్క్రిష్ రఘువంశీ (27 బంతుల్లో 54), ఆండ్రీ రస్సెల్ (19 బంతుల్లో 41) విధ్వంసక బ్యాటింగ్​తో చెలరేగడం వల్లే కేకేఆర్ అంత టార్గెట్​ను సెట్ చేసింది.

రన్ ఛేజ్​లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫెయిలైంది. ఆ టీమ్ 17.2 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రిషబ్ పంత్ (25 బంతుల్లో 55), ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 54) మెరుపు బ్యాటింగ్​తో ఆకట్టుకున్నారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమవడంతో కొండంత స్కోరును అందుకోవడంలో డీసీ వెనుకబడిపోయింది. బ్యాటింగ్​లో సునామీ ఇన్నింగ్స్​తో అలరించిన సునీల్ నరైన్.. బౌలింగ్​లోనూ ఓ వికెట్​తో మెరిశాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్​లో డీసీ 9వ స్థానానికి పడిపోయింది. హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన కోల్​కతా.. టేబుల్ టాపర్​గా నిలిచింది. లీగ్ చరిత్రలో కేకేఆర్​ ఆడిన తొలి మూడు మ్యాచుల్లోనూ నెగ్గడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం మరో విశేషం. మరి.. ఐపీఎల్ పదిహేడో సీజన్​లో నమోదవుతున్న రికార్డులపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: ఇది కదా డెలివరీ అంటే.. రస్సెల్ పై పగ తీర్చుకున్న ఇషాంత్..