iDreamPost

వీడియో: ఇది కదా డెలివరీ అంటే.. రస్సెల్ పై పగ తీర్చుకున్న ఇషాంత్..

Ishant Yorker To Russel: ఐపీఎల్ 2024 సీజన్లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు జరిగిన ఐపీఎల్ మ్యాచులు ఒకెత్తు.. ఇప్పుడు జరుగుతున్న సీజన్ ఒకెత్తు అనేలా ఉంది. ఢిల్లీ- కేకేఆర్ మ్యాచ్ లో కూడా అలాంటి అద్భుతాలే జరిగాయి.

Ishant Yorker To Russel: ఐపీఎల్ 2024 సీజన్లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు జరిగిన ఐపీఎల్ మ్యాచులు ఒకెత్తు.. ఇప్పుడు జరుగుతున్న సీజన్ ఒకెత్తు అనేలా ఉంది. ఢిల్లీ- కేకేఆర్ మ్యాచ్ లో కూడా అలాంటి అద్భుతాలే జరిగాయి.

వీడియో: ఇది కదా డెలివరీ అంటే.. రస్సెల్ పై పగ తీర్చుకున్న ఇషాంత్..

ఐపీఎల్ 2024లో ఏ మ్యాచ్ చూసినా మంచి ఫీల్ వస్తంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగానే సాగుతోంది. ఏ మ్యాచ్ చూసినా మైదానంలో పరుగుల వరద పారుతోంది. తాజాగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్- కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్లు వీర విహారం చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ హిస్టరీలోనే రెండో అత్యధిక టీమ్ స్కోర్ నమోదు అయ్యింది. మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 277 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 272 పరుగులు చేసింది. కేవలం 6 పరుగుల తేడాతో అరుదైన రికార్డును కేకేఆర్ జట్టు మిస్ చేసుకుంది. ఇంత స్కోర్ రావడానికి ముఖ్య కారణం సునీల్ నరైన్ అనే చెప్పాలి. కేవలం 39 బందుల్లోనే 85 పరుగులు చేశాడు. ఆండ్రూ రస్సెల్ కూడా విజృంభించాడు. కానీ, ఇషాంత్ శర్మా మాత్రం రస్సెల్ పై పగ తీర్చుకున్నాడు.

డీసీ- కేకేఆర్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో పరుగుల వరద పారింది. సునీల్ నరైన్(85), అంగ్క్రీష్ రఘువన్షీ(54), ఆండ్రూ రస్సెల్(41), రింకూ సింగ్(26) చెలరేగి ఆడారు. వీళ్ల దెబ్బతో టీమ్ టోటల్ 272 చేరింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లకు ఎక్కడా ఆస్కారం లేకుండా కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. సునీల్ నరైన్, రఘువన్షీ అవుట్ అయ్యాక రస్సెల్- రింకూ సింగ్ బాదుడు మొదలు పెట్టారు. రస్సెల్ అయితే ఆడిన 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 41 పరుగులు చేశాడు. రస్సెల్ ని అలాగే వదిలేసి ఉంటే స్కోర్ 300 అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండేది కాదు. రస్సెల్ దూకుడుకి ఇషాంత్ శర్మ కళ్లెం వేశాడు.

నిజానికి ఈ యార్కర్ ని చూస్తే ఎంతటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయినా కూడా దాసోహం అనాల్సిందే అనే భావన కలుగుతుంది. అప్పటివరకు మెరుపులు మెరిపించిన రస్సెల్ ని ఇషాంత్ తన యార్కర్ తో మైదానంలో సాష్టాంగం పెట్టించేశాడు. ఇషాంత్ యార్కర్ ని ఆడబోయి రస్సెల్ కంట్రోల్ తప్పి ముందుకు పడిపోయాడు. వికెట్ల మీద ఉన్న బెయిల్స్ గాల్లోకి ఎగిరాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అప్పటి వరకు ఢిల్లీ బౌలర్లను వణికించిన రస్సెల్ ను ఇషాంత్ శర్మ వణికించేశాడు. సీనియర్ ప్లేయర్ అనే పదానికి ఇషాంత్ శర్మ నిర్వచనం చెప్పినట్లు అయ్యింది. ఇషాంత్ యార్కర్ ఎంత అద్భుతంగా ఉంది అంటే.. అవుట్ అయ్యాక రస్సెల్ కూడా ఇషాంత్ బాల్ ని మెచ్చుకున్నాడు. చప్పట్లు కొట్టుకుంటూ పెవిలియన్ కి చేరాడు.

ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు చాలానే రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా ఐపీఎల్ హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అలాగే కేకేఆర్ జట్టు తమ ఐపీఎల్ జర్నీలో అత్యధిక సిక్సులు(18) నమోదు చేసింది. అలాగే ఢిల్లీ జట్టుపై ఇప్పటివరకు ఎవరూ 18 సిక్సులు కొట్టలేదు. మొత్తానికి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ బౌలర్స్ ని వణికిస్తే.. ఇషాంత్ శర్మా మాత్రం ఆండ్రూ రస్సెల్ కి షాకిచ్చాడు. మరి.. ఆండ్రూ రస్సెల్ ని యార్కర్ తో భయపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి