Somesekhar
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ 2024 బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ప్రాక్టీస్ లో డెడ్లీ యార్కర్లు సంధిస్తున్నాడు. అతడి యార్కర్లకు బ్యాటర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి.
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ 2024 బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ప్రాక్టీస్ లో డెడ్లీ యార్కర్లు సంధిస్తున్నాడు. అతడి యార్కర్లకు బ్యాటర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి.
Somesekhar
ఐపీఎల్ 2024.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ మెగాటోర్నీపైనే ఉంది. ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి ఇంకా మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో.. యాజమాన్యాలు తమ ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ గ్రౌండ్ లో చెమటోడుస్తున్నాడు. కళ్లుబైర్లు కమ్మే యార్కర్లతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. అతడు వేసిన ఓ స్టన్నింగ్ యార్కర్ కు బ్యాటర్ కిందపడిపోయాడు.
అర్జున్ టెండుల్కర్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కొడుగ్గా అడుగుపెట్టిన అతడు తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అభిమానులను నిరాశకు గురిచేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ముంబై ప్రీ ట్రైనింగ్ క్యాంప్ లో అర్జున్ టెండుల్కర్ కఠోర సాధన చేస్తున్నాడు. ఎక్కువ సమయం బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పదునైన యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రాక్టీస్ లో భాగంగా వేసిన యార్కర్లకు తన సహచర ప్లేయర్ నెహాల్ వధేరా కిందపడిపోయాడు. అర్జున్ యార్కర్ల దెబ్బకు అతడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఈ సీజన్ లో అర్జున్ దుమ్మురేపడం ఖాయమే అంటూ కితాబిస్తున్నారు. కాగా.. గతేడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్జున్, అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. 2023 ఐపీఎల్ సీజన్ లో 3 మ్యాచ్ లు మాత్రమే ఆడి, 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ ఎడిషన్ లో ఎలా రాణిస్తాడా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ముంబై తమ తొలి మ్యాచ్ ను 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ ను ఢీకొనబోతోంది. మరి అర్జున్ టెండుల్కర్ స్టన్నింగ్ యార్కర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Just Arjun doing 𝘈𝘳𝘫𝘶𝘯 things 🏹😉#OneFamily #MumbaiIndians pic.twitter.com/Sv7eObeFSO
— Mumbai Indians (@mipaltan) March 12, 2024
ఇదికూడా చదవండి: చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు.. ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్!