iDreamPost

చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు.. ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్!

  • Published Mar 12, 2024 | 10:14 PMUpdated Mar 12, 2024 | 10:14 PM

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ రంజీల్లో దుమ్మురేపుతున్నాడు. ఏకంగా లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అతడు బ్రేక్ చేశాడు,

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ రంజీల్లో దుమ్మురేపుతున్నాడు. ఏకంగా లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అతడు బ్రేక్ చేశాడు,

  • Published Mar 12, 2024 | 10:14 PMUpdated Mar 12, 2024 | 10:14 PM
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ తమ్ముడు.. ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్!

వయసు 19 సంవత్సరాలు. కానీ ఆట మాత్రం ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఉంటుంది. అతడి టెక్నిక్​, ఫిట్​నెస్​, పరుగులు చేయాలనే కసి.. ఇలా ఎందులో చూసినా లెజెండరీ క్రికెటర్స్​ను గుర్తుకు తెస్తున్నాడు. గుర్తుకు తీసుకురావడమే కాదు.. ఏకంగా ఓ దిగ్గజ క్రికెటర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. అతడే టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్. ఈ టీనేజ్ సంచలనం బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ, ప్రతి మ్యాచ్​లోనూ తన మార్క్​ చూపిస్తున్నాడు. రీసెంట్​గా జరిగిన అండర్-19 ప్రపంచ కప్​లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ దుమ్మురేపిన ముషీర్.. ఇప్పుడు రంజీ ట్రోఫీ-2024లోనూ సత్తా చాటుతున్నాడు. ఏకంగా సచిన్ టెండూల్కర్ రికార్డుకే అతడు ఎసరు పెట్టాడు.

విదర్భతో జరుగుతున్న రంజీ ఫైనల్​లో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్ రెచ్చిపోయి ఆడాడు. తొలి ఇన్నింగ్స్​లో 6 పరుగులే చేసి ఔటైన ఈ యువ తరంగం.. రెండో ఇన్నింగ్స్​లో మాత్రం అద్భుతమైన సెంచరీతో గర్జించాడు. 326 బంతులు ఎదుర్కొన్న అతడు 136 పరుగులు చేశాడు. సాధారణంగా క్విక్​గా రన్స్ చేసే ముషీర్.. ఈ మ్యాచ్​లో మాత్రం చాలా ఓపిగ్గా ఆడాడు. వికెట్ల మీద కుదురుకోవడం మీదే ఫోకస్ చేశాడు. క్రీజులో పాతుకుపోయిన తర్వాత కూడా స్ట్రయిక్ రొటేషన్ చేస్తూ సీనియర్ బ్యాటర్లు అజింక్యా రహానె (73), శ్రేయస్ అయ్యర్ (95) లాంటి వాళ్లు అటాక్ చేసి ఆడేలా ప్రోత్సహించాడు. ఒకవైపు ముషీర్ వికెట్లకు అడ్డంగా నిలబడటం వల్లే.. ఇంకోవైపు మిగిలిన బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించారు.

ఫైనల్ మ్యాచ్​లో ముషీర్ ఆడిన ఇన్నింగ్స్​ ఎప్పటికీ స్పెషల్​గా గుర్తుండిపోతుందనే చెప్పాలి. ఈ సెంచరీతో అతడు చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్​లో అత్యంత పిన్న వయసులో సెంచరీ బాదిన ముంబై క్రికెటర్​గా ముషీర్ రికార్డు క్రియేట్ చేశాడు. 19 ఏళ్ల 14 రోజుల వయసులో ఈ ఫీట్​ను అందుకున్నాడు ముషీర్. కాగా, ఇప్పటిదాకా బ్యాటింగ్ గ్రేట్ సచిన్ పేరిట ఈ రికార్డు ఉండేది. 1994-95 రంజీ సీజన్ ఫైనల్​లో 21 ఏళ్ల 11 నెలల వయసులో మాస్టర్ బ్లాస్టర్ శతకం బాదాడు. కాగా, విదర్భకు ముంబైకి మధ్య జరుగుతున్న మ్యాచ్​ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్​లో నుంచి వీక్షించాడు. ఆయన ముందే ముషీర్ ఈ ఘనత సాధించడం విశేషం. సచిన్​తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఈ మ్యాచ్​ కోసం వాంఖడేకు వచ్చారు. మరి.. సచిన్ రికార్డును సర్ఫరాజ్ సోదరుడు బద్దలు కొట్టడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అయ్యర్ బ్యాటింగ్ విధ్వంసం.. బీసీసీఐ దెబ్బకు సెట్టయ్యాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి