Nidhan
సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌పై గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. అసలు ఏబీడీకి ఏ హక్కు ఉందని అలా అంటాడంటూ ఫైర్ అయ్యాడు.
సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌పై గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. అసలు ఏబీడీకి ఏ హక్కు ఉందని అలా అంటాడంటూ ఫైర్ అయ్యాడు.
Nidhan
టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నాడు. గత ఏడాది వరకు లక్నో సూపర్ జియాంట్స్‌కు మెంటార్‌గా ఉంటూ టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు గౌతీ. ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షిఫ్ట్ అయ్యాడు. కేకేఆర్ కొత్త మెంటార్‌గా వచ్చి ఆ టీమ్ రాత మార్చేశాడు. సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపడం, వరుసగా ఫెయిల్ అవుతున్నా మిచెల్ స్టార్క్‌ను కంటిన్యూ చేయడం లాంటి అతడి డిసిషన్స్ వల్ల జట్టు వరుస విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. ఆటగాళ్లలోని టాలెంట్‌ను బయటకు తీస్తూ, వారికి అవసరమైన సపోర్ట్‌ను అందిస్తూ కేకేఆర్‌కు నయా హీరోగా మారాడు గంభీర్. అలాంటోడు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై సీరియస్ అయ్యాడు. ఏ హక్కు ఉందని ఏబీడీ ఆ మాట అంటాడంటూ ఫైర్ అయ్యాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఈ మధ్య డివిలియర్స్ పలు విమర్శలు చేశాడు. పాండ్యాలో అహంకారం స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్స్ టీమ్‌లో ఉన్నప్పుడు హార్దిక్ ఇలాంటి ధోరణితో వ్యవహరించడం సరికాదని చురకలు అంటించాడు. ఎక్స్పీరియెన్స్డ్ ప్లేయర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకొని జట్టును నడపడం లేదన్నాడు. ధోని మాదిరిగా కెప్టెన్సీ చేయాలని చూస్తున్నాడని.. కానీ ఎంఐలో అది వర్కౌట్ కాదన్నాడు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలపై గంభీర్ సీరియస్ అయ్యాడు. అసలు హార్దిక్‌ను అనేందుకు డివిలియర్స్‌కు ఏం అర్హత ఉందని ప్రశ్నించాడు. కెప్టెన్సీకి పనికిరాడనే మాట ఎలా అంటాడని క్వశ్చన్ చేశాడు. ఐపీఎల్లో ఏబీడీ పరుగులు చేయడం తప్ప, ఏదీ సాధించలేదని.. అలాంటప్పుడు పాండ్యాను ఎలా విమర్శిస్తాడని ఫైర్ అయ్యాడు.
‘ఎక్స్పర్ట్స్ ఏం అంటున్నారనేది మ్యాటర్ కాదు. వాళ్లు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేను ఒకటే చెబుతా. ఎవరి కెప్టెన్సీని అయినా అంచనా వేయాలంటే అతడి టీమ్ విజయాలు సాధిస్తుందా? లేదా? అనేది చూడాలని చెబుతా. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఈసారి బాగా పెర్ఫార్మ్ చేసుంటే ఎక్స్ట్పర్ట్స్ అందరూ హార్దిక్ పాండ్యాను మెచ్చుకునేవారు. ఎంఐ వరుస మ్యాచుల్లో ఓడింది కాబట్టే అతడ్ని విమర్శిస్తున్నారు. ఇంకో ఫ్రాంచైజీ నుంచి వచ్చినందున పాండ్యాకు సెటిల్ అయ్యేందుకు కాస్త టైమ్ ఇవ్వాలి. అయినా అతడ్ని విమర్శించేందుకు డివిలియర్స్, పీటర్సన్‌కు ఏం హక్కు ఉంది? వాళ్లిద్దరూ ఐపీఎల్లో ఏం సాధించారు? వ్యక్తిగతంగా బాగా రన్స్ చేసినంత మాత్రాన కెప్టెన్సీ గురించి కామెంట్స్ చేసేంత స్థాయి వాళ్లకు లేదు’ అంటూ గంభీర్ విరుచుకుపడ్డాడు. మరి.. ఏబీడీపై గౌతీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.