iDreamPost
android-app
ios-app

Virat Kohli: మీడియాకు స్పెషల్ గిఫ్ట్స్​ ఇచ్చిన కోహ్లీ దంపతులు.. ఎందుకో తెలుసా?

  • Published May 14, 2024 | 5:10 PM Updated Updated May 14, 2024 | 5:10 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీడియాకు స్పెషల్ గిఫ్ట్స్​ ఇచ్చాడు. అతడు ఎందుకిలా చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీడియాకు స్పెషల్ గిఫ్ట్స్​ ఇచ్చాడు. అతడు ఎందుకిలా చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Published May 14, 2024 | 5:10 PMUpdated May 14, 2024 | 5:10 PM
Virat Kohli: మీడియాకు స్పెషల్ గిఫ్ట్స్​ ఇచ్చిన కోహ్లీ దంపతులు.. ఎందుకో తెలుసా?

టీమిండియా సీనియర్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ అందరితోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. మీడియా వాళ్లతోనూ అతడికి సత్సంబంధాలు ఉన్నాయి. కెప్టెన్​గా ఉన్నప్పుడు కూడా రిపోర్టర్స్​ అడిగిన ప్రశ్నలకు కూల్​గా ఆన్సర్స్ ఇచ్చేవాడు. ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు కూడా విసుక్కోకుండా నవ్వుతూ సమాధానాలు ఇచ్చేవాడు. ఇప్పుడు మీడియాకు చెందిన కొందరు ఫొటోగ్రాపర్లకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడు కోహ్లీ. విరాట్​తో పాటు అతడి సతీమణి అనుష్క శర్మ కలసి మీడియా వారికి ప్రత్యేక బహుమతులు పంపారు. విరుష్క జోడీ ఇలా ఎందుకు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

విరుష్క దంపతులు కొంతమంది మీడియా ఫొటోగ్రాఫర్లకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ పిల్లలు వామిక, అకాయ్ ప్రైవసీకి భంగం కలిగించనందుకు గానూ పాపరాజీల (ఫొటోగ్రాఫర్లు)కు బహుమతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్మార్ట్ వాచ్​లు, స్వీట్స్​, ఇతర టెక్నికల్ గాడ్జెట్స్​ను కలిపి బాక్స్​లో పెట్టి గిఫ్ట్​లు అందించారు. కోహ్లీ-అనుష్క దంపతులకు మొదటి సంతానంగా కూతురు పుట్టింది. తనకు వామిక అని నామకరణం చేశారు. ఈ మధ్యే వీళ్లకు కుమారుడు జన్మించాడు. అతడికి అకాయ్ అనే పేరు పెట్టారు. అయితే ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఫొటోలు ఇప్పటిదాకా బయటకు రాలేదు.

కోహ్లీ దంపతులు తమ సంతానం ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వామిక, అకాయ్​ను ఎయిర్​పోర్ట్ లేదా ఇతర పబ్లిక్ ప్లేసెస్​కు తీసుకొచ్చినప్పుడు కూడా ఫొటోలు, వీడియోలు తీయకుండా కేర్ తీసుకుంటున్నారు. వాళ్లకు ప్రైవసీ ఇవ్వాలంటూ పాపరాజీలను కూడా కోరారు. వాళ్లు సహకరించడంతో ఫొటోలు బయటకు రాలేదు. అందుకే ఇప్పుడు గిఫ్ట్​లు ఇచ్చి వాళ్లను సంతోషపర్చారు విరుష్క జోడీ. కాగా, కొన్ని సందర్భాల్లో వామిక ఫొటోలు తీయొద్దంటూ ఫొటోగ్రాఫర్లపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. కొందరు అతడికి సహకరించినా, మరికొందరు వార్నింగ్​ను పట్టించుకోకుండా ఫొటోలకు ఎగబడ్డారు. మరి.. మీడియాకు కోహ్లీ దంపతులు గిఫ్ట్స్ ఇవ్వడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet