అదృష్టం అంటే నీదే బుల్లెమ్మ.. రాళ్లను పగలగొడుతుండగా బయటపడ్డ వజ్రాలు, రత్నాలు

Diamonds&Crystals: కొంతమంది వజ్రాల కోసం, విలువైన వస్తువుల కోసం మైనింగ్ చేస్తుంటారు. కొన్ని గనులని, పొలాలని లీజ్ కి తీసుకుని మరి ఏళ్ల తరబడి వజ్రాల కోసం కృషి చేస్తుంటారు. అయితే కొంతమందిని చాలా తక్కువ సమయంలోనే అదృష్టం వరిస్తుంది. ఈ బుల్లెమ్మ జాతకం కూడా బాగున్నట్టుంది. ఏకంగా విలువైన వజ్రాలు, రత్నాలు ఆమెను వరించాయి.

Diamonds&Crystals: కొంతమంది వజ్రాల కోసం, విలువైన వస్తువుల కోసం మైనింగ్ చేస్తుంటారు. కొన్ని గనులని, పొలాలని లీజ్ కి తీసుకుని మరి ఏళ్ల తరబడి వజ్రాల కోసం కృషి చేస్తుంటారు. అయితే కొంతమందిని చాలా తక్కువ సమయంలోనే అదృష్టం వరిస్తుంది. ఈ బుల్లెమ్మ జాతకం కూడా బాగున్నట్టుంది. ఏకంగా విలువైన వజ్రాలు, రత్నాలు ఆమెను వరించాయి.

ఏదైనా కలిసి రావాలంటే అదృష్టం ఉండాలని అంటారు. దేనికైనా రాసిపెట్టి ఉండాలని అంటూ ఉంటారు. కొంతమందికి అదృష్టం అనుకోకుండా శని పట్టుకున్నట్టు పట్టుకుంటుంది. అదృష్టం ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో తెలియదు. ఒకదాని కోసం ప్రయత్నిస్తుంటే అంతకంటే విలువైనది ఎదురవుతుంది. దాన్నే అదృష్టం అంటారు. పొలాల్లో వజ్రాల కోసం ఎంతోమంది వేట కొనసాగిస్తుంటారు. అయితే అంతమందిలో కేవలం ఒకరిద్దరిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. తొలకరి వానలు పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రజలు వజ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. ఆ మధ్య కొంతమంది రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున పొలాలకు చేరుకొని వజ్రాల కోసం తవ్వకాలు మొదలుపెట్టారు.

అయితే అంతమందిలో ఒక రైతుకి మాత్రమే అదృష్టం వరించింది. ఒక రైతుకు ఒక వజ్రం దొరకగా దాన్ని ఒక వజ్రాల వ్యాపారి సొంతం చేసుకున్నాడు. ఇలా చాలా మంది వజ్రాల కోసం వేట సాగించగా అందులో ఒకరిద్దరు మాత్రమే అదృష్టవంతులవుతారు. తాజాగా ఓ వ్యక్తి బండరాళ్లు పగలగొడుతుంటే వజ్రాలు తగిలాయి. కొన్ని నెలల క్రితం రాస్పెసిమెన్ అనే వ్యక్తి ప్రాజెక్టులో భాగంగా హెర్కిమెర్ డైమండ్ మైన్స్ లో కొంతమంది పని చేయడానికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తికీ పెద్ద బండరాయి కనిపించింది. అది చాలా దృఢంగా ఉంది. అస్సలు కదిలించలేని పరిస్థితిలో ఉంది. ఆ బండరాయిని బద్దలుకొట్టడానికి అతనికి గంట సమయం పట్టింది. పెద్ద సుత్తితో బండరాళ్లను పగులగొడుతున్నాడు. దాని పక్క మరొక రాయి ఉంటే దాన్ని పగులగొట్టాడు.

ఏదో ఉంది అని అనిపించి ఆ రాయి కింద ఇనుప రాడ్లు పెట్టి సుత్తితో బలంగా రాయిని కొట్టి ఆ తర్వాత పైకి లేపాడు. ఆ తర్వాత రాయి కింద ఉన్న మట్టిని తీశాడు. ఇంకేముంది అదృష్ట దేవత ఆ వ్యక్తిని వరించింది. ఒక పెద్ద వజ్రం అతనికి చిక్కింది. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాలను చేతిలోకి తీసుకుని ఆ వ్యక్తి తెగ మురిసిపోయాడు. ఆ తర్వాత మరొక యువతి తవ్విన గొయ్యి లోపల చేయి పెట్టి వజ్రాలను, విలువైన రత్నాలను బయటకు తీస్తుంది. సాంప్రదాయ రత్నాల కంటే కూడా ఈ రత్నాలు చాలా విలువైనవి. వాటి నాణ్యత, ప్రకాశవంతం కారణంగా అవి అత్యంత ధరను కలిగి ఉంటాయి. అలాంటి రత్నాలు ఆమెకు పదుల సంఖ్యలో దొరికాయి. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.

కొన్ని వజ్రాలు కూడా దొరికాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ దీనిపై స్పందిస్తున్నారు. మొత్తానికి నీ కష్టానికి ఫలితం దక్కిందోయ్.. నీకు అదృష్టమే పట్టిందోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాస్పెసిమెన్ అనే ఇన్స్టా ఖాతాలో డైమండ్ మైనింగ్ కి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళు న్యూయార్క్ చెందిన వ్యక్తులు. మైనింగ్ గనుల్లో ఇలా వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు. బండరాళ్లను పగులగొట్టి వజ్రాలను వెలికితీస్తుంటారు. రాస్పెసిమెన్ ఖాతాలో వజ్రాల వెలికితీతకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా కనబడుతున్నాయి.   

Show comments