Venkateswarlu
Venkateswarlu
దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విషాదంగా ఇద్దరి ప్రేమ కథ ఎండ్ అయినా.. ప్రేక్షకుల మదిలో మాత్రం మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. దుల్కర్- మృణాల్‌ల నటనకు కన్నీరు పెట్టుకోని వారుండరంటే అతిశయోక్తిలేదు. ఈ సినిమాలో రాజకుమారి అయిన మృణాల్- దుల్కర్ కోసం అన్నిటిని వదులుకుని మరీ వస్తుంది. అంతే.. యువకులు మొత్తం సీతలాంటి అమ్మాయి జీవిత భాగస్వామి కావాలని కోరుకోవటం మొదలుపెట్టారు. ఇక, అచ్చం ఇలాంటి సంఘటనే నిజజీవితంలోనూ చోటుచేసుకుంది. ఓ కోటీశ్వరుడి కూతురు తాను ప్రేమించిన అబ్బాయికోసం ఆస్తిని కాదనుకుని వెళ్లిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..
మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కూ కే పెంగ్- పౌవ్‌లైన్ చాయ్‌లకు ఓ కూతురు ఉంది. ఆమె పేరు ఎంజలైన్ ప్రాన్సిస్. ఎంజలైన్ 2008కి ముందు ఆక్సఫర్డ్ యూనివర్శిటీలో చదివేది. ఆ సమయంలో తోటి విద్యార్థి అయిన ఓ యువకుడితో ఆమెకు పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, వీరి పెళ్లికి ఎంజలైన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆస్తి అంతరాలను సాకుగా చూపుతూ అతడితో పెళ్లికి నిరాకరించారు. అయితే, తల్లిదండ్రుల కోసం ఎంజలైన్ తన ప్రేమను కాదనుకోలేదు. తాను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడితోటే జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది.
దాదాపు 2,484 కోట్ల రూపాయల ఆస్తిని కాదనుకుని ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది. 2008లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రెండు కుటుంబాలకు దూరంగా ఎంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే, ఓ సారి ఆమె బలవంతంగా తల్లిదండ్రులను కలవాల్సిన అవసరం వచ్చింది. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోవాలనుకున్నపుడు జెడ్డాలోని కోర్టుకు వెళ్లింది. తన తల్లి మద్దతుగా మాట్లాడింది. వారిద్దరికీ విడాకులు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ వేరు వేరుగా ఉంటున్నారు. ఎప్పటికైనా తమ తల్లిదండ్రులు కలుస్తారని ఎంజలినా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి, ప్రాణంగా ప్రేమించిన వాడి కోసం వేల కోట్ల ఆస్తిని కాదననుకున్న ఎంజలైన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.