అక్కడ ఎలా పార్క్ చేశారు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ఇటీవల కాలంలో మహిళలు డ్రైవింగ్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వీడియో వైరల్ కావడమే కాదూ.. అదెలా సాధ్యమంటూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

ఇటీవల కాలంలో మహిళలు డ్రైవింగ్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వీడియో వైరల్ కావడమే కాదూ.. అదెలా సాధ్యమంటూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

’లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం‘ ఆనాడే చెప్పారు సీనియర్ ఎన్టీఆర్. ‘రాకెట్లు తోలావు.. రాజ్యాలు ఏలావు.. యుద్దాలు చేశావు, ప్రాణాలు పోశావు’ అన్నట్లుగా ఆడ పిల్లలు అబలలు కాదు సబల అని నిరూపిస్తున్నారు. ఆకాశంలో సగం, అవనిలో సగమే కాదు.. తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు అంతరిక్షానికి కూడా వెళుతున్నారు. పార్లమెంట్‌లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు నారీ మణులు. ఆకాశంలో విమానాలను నడపమే కాదూ.. రోడ్డుపై భారీ వాహనాలను కూడా డ్రైవ్ చేస్తున్నారు. తాము ఎందులో తీసిపోము అని నిరూపించేందుకు బండిపై రిస్కీ స్కిట్స్ కూడా చేస్తున్నారు.

కానీ కొన్ని సార్లు.. అదుపు తప్పి.. ఇదిగో ఇలా కూడా బోల్తా పడి.. మగవాళ్లకు.. నెటిజన్లకు అవకాశం ఇస్తున్నారు. ప్రస్తుతం అటువంటి ఓ వీడియో వైరల్ అవుతుంది. సాధారణంగా ప్రమాదం జరిగితే.. రోడ్డుపై పడిపోవడం లేకుండా.. సమీపంలోని డివైడర్లపైకి ఎక్కేయడం.. ఈ రోడ్డులో నుండి పక్కనే ఉన్న మరో రహదారిపైకి వాహనం బోల్తా కొట్టడం చూసి ఉంటారు. కానీ ఈ వీడియోలో ఇంటి పై కప్పుపైకి దూసుకెళ్లిపోయింది. స్కూటీతో పాటు ఇద్దరు మహిళలు.. ఆ పై కప్పులోనే చిక్కుకుపోయారు. దీంతో వెంటనే స్థానికులు వారికి సాయం చేశాడు. ఓ వ్యక్తి మెల్లిగా వెళ్లి.. పెంకుల్లో ఇరుక్కుపోయిన ఇద్దర్నీ బయటకు లాగే ప్రయత్నం చేశాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో సుమారు మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్ వస్తున్నాయి. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మహిళల్ని నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘బెస్ట్ ఉమెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్.. యూ డిజర్వ్ ఆస్కార్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇట్స్ ఆల్వేజ్ ఉమెన్‘ అంటూ మరో నెటిజన్ రాశాడు. గూగుల్స్ మ్యాప్స్ నమ్మొద్దని ఒకరు..ఇది మీ తప్పు కాదూ.. ఇంటిదే తప్పు అని మరొకరు హేళన చేస్తున్నారు. రూఫ్ పై ఎలా పార్క్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. ‘ ఈ వీడియో చూశాక.. నా మైండ్ కొన్ని సెకన్ల పాటు ఆగిపోయింది’ అంటున్నాడో మరో సోషల్ సైనికుడు. కామెంట్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది మహిళలకు మద్దుతుగా మాట్లాడుతన్నారు.

Show comments