iDreamPost
android-app
ios-app

68 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన దగ్గు మందు.. ఇండియన్‌కి 20 ఏళ్లు శిక్ష

  • Published Feb 27, 2024 | 1:52 PM Updated Updated Feb 27, 2024 | 1:52 PM

సాధారణంగా చిన్న నుంచి పెద్ద వరకు దగ్గు, జలుబు వంటి ఇన్​ఫెక్షన్స్ బారిన పడినప్పుడు దగ్గు సిరప్ ను ఎక్కువగా ఉపాయోగిస్తుంటారు. అయితే ఈ దగ్గు మందును తాగడం వలన ఓ దేశంలో చాలా ఘోరం జరిగిపోయింది.

సాధారణంగా చిన్న నుంచి పెద్ద వరకు దగ్గు, జలుబు వంటి ఇన్​ఫెక్షన్స్ బారిన పడినప్పుడు దగ్గు సిరప్ ను ఎక్కువగా ఉపాయోగిస్తుంటారు. అయితే ఈ దగ్గు మందును తాగడం వలన ఓ దేశంలో చాలా ఘోరం జరిగిపోయింది.

  • Published Feb 27, 2024 | 1:52 PMUpdated Feb 27, 2024 | 1:52 PM
68 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన దగ్గు మందు.. ఇండియన్‌కి 20 ఏళ్లు శిక్ష

సాధారణంగా చిన్న నుంచి పెద్ద వరకు చాలామంది సీజనల్ ఇన్​ఫెక్షన్స్ వాళ్ల కానీ మరో ఏ ఇతర కారణాల చేతగాని దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. అలాంటి సమయంలో వైద్యుడిని సంప్రదించడం కానీ, స్థానిక మెడికల్ స్టోరికి వెళ్లి ట్యాబ్లెట్స్, దగ్గు సిరప్ వంటివి తీసుకోవడం చేస్తుంటారు. అయితే ఎక్కువ శాతం అందరూ దగ్గు సిరప్ ను ఉపాయోగిస్తారు. ఎందుకంటే టాబ్లెట్స్ కంటే దగ్గు సిరప్ అనేది తొందరగా నయం చేస్తుందనే కారణంతో చిన్న పిల్లలకు సైతం పట్టిస్తారు. కానీ, ఇప్పుడు ఆ దగ్గు మందువల్ల ఓ దేశంలో ఘోర ప్రమాదమే జరిగింది. దీంతో   ఒక్కసారిగా దేశమంతటా అందరిని ఉలిక్కిపడేలా చేసింది.  ఇంతకి ఏం జరిగిందంటే..

దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి సాధారణంగా దగ్గు సిరప్ ను పట్టిస్తారు. కానీ, ఈ దగ్గు సిరప్ వాళ్ల అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను బలిగొంది. అయితే భారత్‌లో తయారైన కొన్ని రకాల దగ్గు సిరప్‌లను తీసుకోవడం వలనే ఆ పిల్లలు చనిపోయినట్లు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువరించాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఉజ్బెకిస్థాన్‌లో దగ్గుతో బాధపడుతున్న 68 మంది చిన్ననారులు ఈ దగ్గు సిరప్ ను తీసుకొని కోలుకోవడానికి బదులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే వాంతులు చేసుకోవడం, విపరీతమైన జ్వరం, కిడ్నీల ఇన్ఫెక్షన్‌ లాంటి లక్షణాలతో చనిపోయినట్టు కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. అలాగే ఈ కేసులో ఓ భారతీయుడితో సహా 22 మందిని దోషులుగా నిర్దారించింది.

అయితే, ఈ కేసులో సింగ్ రాఘవేంద్ర ప్రతార్ అనే భారతీయుడికి 20 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మారియన్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ దగ్గు సిరప్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం తెలిసింది. ఇక మారియన్ ఫార్మాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న క్యురామాక్స్ మెడికల్‌లో రాఘవేంద్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల మరణాల కేసులో ప్రతార్‌తో పాటు మరో 22 మందికి జైలు శిక్ష ఖరారయ్యింది.

పైగా నిందితులు నాసిరకం, నకిలీ మందుల అమ్మకం, కార్యాలయ దుర్వినియోగం, నిర్లక్ష్యం, ఫోర్జరీ, లంచం వంటి నేరాలకు పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. అయితే దిగుమతి చేసుకున్న మందులకు లైసెన్సింగ్ బాధ్యత వహించిన మాజీ సీనియర్ అధికారులను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించి, జైలు శిక్ష ఖరారు చేసింది. ఇక ఈ సిరప్ తాగి ప్రాణాలు కోల్పోయిన 68 మంది చిన్నారుల కుటుంబాలకు ఒక బిలియన్ ఉజ్బెక్ డాలర్లు ( 80,000 అమెరికా డాలర్లు) పరిహారంగా చెల్లించాలని ఉజ్బెకిస్తాన్ కోర్టు తీర్పు చెప్పింది. సిరప్ ద్వారా ప్రభావితమైన మరో ఎనిమిది మంది పిల్లల తల్లిదండ్రులు 16 వేల నుంచి 40 వేల అమెరికా డాలర్ల వరకు పరిహారంగా పొందుతారు.

ఇక రెండేళ్ల కిందట గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో కూడా చాలా మంది పిల్లలు భారత్‌లో తయారైన దగ్గు మందు వాడిన కారణంగా ప్రాణాలు కోల్పోయారని అప్పటిలో ఆరోపణలు వచ్చాయి. ఈ దగ్గు మందుల వల్ల భారత్‌లో కూడా 2019 నుంచి 2020 మధ్య 12 మంది పిల్లలు చనిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, వీటిని తయారు చేసిన కంపెనీలు మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపడేశాయి. ఇవి సురక్షితమైనవేనని, వీటి తయారీలో ఎలాంటి ప్రాణాంతక రసాయనాలు లేవని చెప్పాయి. అయితే, నిషేధించిన డ్రగ్ కాంబినేషన్‌లో క్లోర్ఫెనిరామైన్ మేలియేట్, ఫినైలెఫ్రిన్ ఔషధాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. మరి, దగ్గు సిరప్ వలన అన్యం పుణ్యం తెలియని 68మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.