పాపం ఆ చెఫ్‌ పరిస్థితి ఎవరికి రాకూడదు.. కనీసం నీళ్లు కూడా తాగలేని స్థితి!

మనిషి ఎంత సంపాదించినా.. కడుపుకు తినేది పట్టెడు మెతుకులు మాత్రమే. మూడు పూటలా నాలుగు వేళ్లు చేతిలోకి వెళ్తే.. చాలు. కూటి కోసమే కోటి విద్యలు అంటారు. మరి అంత కష్టపడి లక్షలు సంపాందించినా.. సరే తినలేని పరిస్థితలు ఉంటే.. ఆహారం కాదు కదా కనీసం నీళ్లు తాగడానికి కూడా అవకాశం లేకపోతే.. అందునా ఆ మనిషి ఫేమస్‌ చెప్‌ అయితే వారు అనుభవించే నరకం మాటల్లో వర్ణించలేము. తాను వండిన వంటను నలుగురు తిని మెచ్చుకుంటే మురిసి పోవడమే కానీ.. తాను కండుపు నిండా తినే అవకాశం లేకపోతే.. ఆ పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది ఓ మహిళా చెఫ్‌. తినడం కాదు కదా.. కనీసం నీరు తాగే అవకాశం కూడా లేదు. మరి ఇంతకు ఏంజరిగింది అంటే..

యూకేలోనే డోర్సెట్‌ ప్రాంతానికి చెందని లోరెట్టా హార్మ్స్‌ అనే మహిళ చెఫ్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం అనగా.. 2015లో ఆమె అరుదైన వ్యాధి బారిన పడ్డారు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా జీవించిన ఆమె.. అరుదైన వ్యాధి బారిన పడి నరకం చూసింది. ఆమెకు వచ్చిన వ్యాధి ఏకంగా 13 జబ్బుల సమాహారం. 2015లో ఈ అరుదైన వ్యాధి బారిన పడింది లోరెట్టా. ఎహ్లర్స్‌-డాన్లోస్‌ అనే సిండ్రోమ్‌ బారిని పడింది లోరెట్టా. దీని కారణంగా ఏం తిన్నా కడుపుబ్బరంగా అనిపించేది. తిన్న ఆహారం జీర్ణం కాక.. కడుపునొప్పి సమస్యతో బాధపడేది. ముందుగా దీన్నేదో డైజెషన్‌ ప్రాబ్లమ్‌గా భావించింది లోరెట్టా.

వైద్యులను సంప్రదించడంతో ఆమె సమస్య వెలుగులోకి వచ్చింది. లోరెట్టా పదమూడు వ్యాధుల సమాహారమైన ఎహ్లర్స్‌-డాన్లోస్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారని గర్తించారు. ఈ వ్యాధి ఉన్నవారికి ఏం తిన్నా అరగదని.. కనీసం నీళ్లు కూడా డైజెస్ట్‌ కావని తెలిపారు. దాంతో లోరెట్టా సుమారు 18 గంటల పాటు శరీరం మీద ఒక బ్యాగ్‌ను ధరించి ఉంటుంది. దాని గుండానే లిక్విడ్​ రూపంలో ఆహారాన్ని అందుకుంటుంది. వ్యాధి వచ్చిన మొదట్లో తాను ఏం తిన్న జీర్ణం కాకపోయేదని లోరెట్టా తెలిపింది. ఈ వ్యాధి వచ్చిన ప్రారంభంలో తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని.. కానీ ప్రస్తుతం మనోధైర్యంతో ముందుకు సాగుతున్నానని వెల్లడించింది. ప్రస్తుతం తనకు ఎంతో ఇష్టమైన చెఫ్‌గా రాణిస్తూ.. జనాలకు రుచికరమైన భోజనం వండి సర్వ్‌ చేస్తోంది లోరెట్టా.

Show comments