iDreamPost
android-app
ios-app

Netflix: యూజర్లకు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్‌.. భారీగా పెరిగిన నెలవారి ప్లాన్‌ ధర.. ఎంతంటే..

  • Published Jul 08, 2024 | 3:04 PM Updated Updated Jul 08, 2024 | 3:04 PM

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ తన యూజర్లకు భారీ షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నెలవారి ప్లాన్‌ ధరను భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ తన యూజర్లకు భారీ షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నెలవారి ప్లాన్‌ ధరను భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

  • Published Jul 08, 2024 | 3:04 PMUpdated Jul 08, 2024 | 3:04 PM
Netflix: యూజర్లకు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్‌.. భారీగా పెరిగిన నెలవారి ప్లాన్‌ ధర.. ఎంతంటే..

నేటి కాలంలో ఓటీటీలకు విపరీతైమన క్రేజ్‌ పెరిగింది. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే వారి కన్నా.. ఓటీటీల్లో మూవీలు చూసే వారి సంఖ్యనే విపరీతంగా ఉంది. వీటి క్రేజ్‌ పెరిగిన తర్వాత చాలా మంది థియేటర్‌లకు వెళ్లి సినిమాలు చూడటం మానేశారు. ఎంత భారీ బడ్జెట్‌ సినిమా అయినా సరే నెల రోజులు ఆగితే.. ఓటీటీల్లో విడుదల అవుతుంది. ఇక వీటి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ అవుతున్నాయి. వీటిల్లో సినిమాలు మాత్రమే కాక.. వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ ఫిల్మ్‌లతో పాటు అనేక వినోద కార్యక్రమాలు కూడా టెలికాస్ట్‌ అవుతున్నాయి.

ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ని అందించడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు భారీగా ఖర్చు చేస్తున్నాయి. మన దగ్గర అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ హాట్‌ స్టార్‌లకు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. వీటిలో ఉన్న కంటెంట్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. ఇవి నెల, 3, 6, 12 నెలల వారీగా అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ తన కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. ప్లాన్‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Netflix shocked the users

నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచినట్లు కస్టమర్లు.. సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఇకపై యాడ్స్‌ లేకుండా నెట్‌ఫ్లిక్స్‌ను ఉపయోగించుకోవాలంటే.. అదనంగా చెల్లించాలంటూ తమకు మెసేజ్‌లు వచ్చాయని కస్టమర్లు.. సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో రెడిట్‌లో ఓ యూజర్‌.. నెటిఫ్లిక్స్‌ ప్లాన్‌ ధర పెంపుకు సంబంధించి తనకు వచ్చిన మెసేజ్‌ను రెడిట్‌లో పోస్ట్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ నుంచి మెసేజ్‌ వచ్చింది. మీ ప్లాన్‌ జూలై 13 నాటికి ముగియనుంది. మీరు చూడటం కొనసాగించాలంటే.. కొత్త ప్లాన్‌ను ఎంచుకొండి అనే సందశం వచ్చినట్లు పోస్ట్‌ చేశాడు. సదరు యూజర్‌ తాను ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం రూ.1000 బేసిక్‌ ప్లాన్‌ను వాడుతున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విత్‌ యాడ్స్‌తో చూడటం కోసం 580 రూపాయలు చెల్లించాలి. యాడ్‌ఫ్రీ కోసం అయితే.. 1300 చెల్లించాలి. అంతేకాక 4కే క్వాలిటీలో చూడాలంటే.. 2 వేల రూపాయుల చెల్లించాలి. ఇక రెడిట్‌ ప్రకారం ఇలా ప్లాన్‌ రేట్ల పెంపు గురించి మెసేజ్‌ అందుకున్న వాళ్లు.. ఎక్కువగా కెనడా, యూకే యూజర్లు ఉన్నారని.. బహుశా.. నెట్‌ఫ్లిక్స్‌ ఆయా దేశాల్లో తన ప్లాన్‌ రేటును పెంచే ఆలోచన చేస్తుందేమో అంటున్నారు. అయితే ఈ ఏడాది సెకండాఫ్‌ నుంచి ప్లాన్‌ ధరలను పెంచుతామని నెట్‌ఫ్లిక్స్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలసిందే. ఆ మేరకే ఇప్పుడు రేట్లను పెంచింది అంటున్నారు.

భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫారమ్ నాలుగు ప్లాన్‌లను అందిస్తుంది. మొబైల్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం. నెలకు రూ. 199 ధర కలిగిన బేసిక్ ప్లాన్, మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు, స్మార్ట్ టీవీలలో 720p రిజల్యూషన్‌లో స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. మన దగ్గర ఈ ప్లాన్‌ ధరలు స్థిరంగానే ఉన్నట్లు తెలుస్తుంది.