Tomato Sold Rs 200 Per KG In Pakistan: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు.. అక్కడ కిలో టమాటా ధరతో మనం మటన్ లాగించవచ్చు!

Tomato Price: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు.. అక్కడ కిలో టమాటా ధరతో మనం మటన్ లాగించవచ్చు!

కూరగాయల ధరలు చూస్తే సామాన్యులకు గుండెపోటు వచ్చే పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా టమాటా కొనుగోలు చేయాలంటే.. భయపడిపోతున్నారు. ఎందుకంటే టమాటా రేటు చుక్కలను తాకుతుంది. ఇక పాక్‌లో అయితే కిలో టమాటా ధరతో మనం మటన్‌ తినొచ్చు. అంత భారీగా పెరిగింది. ఆ వివరాలు..

కూరగాయల ధరలు చూస్తే సామాన్యులకు గుండెపోటు వచ్చే పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా టమాటా కొనుగోలు చేయాలంటే.. భయపడిపోతున్నారు. ఎందుకంటే టమాటా రేటు చుక్కలను తాకుతుంది. ఇక పాక్‌లో అయితే కిలో టమాటా ధరతో మనం మటన్‌ తినొచ్చు. అంత భారీగా పెరిగింది. ఆ వివరాలు..

కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు ఏ కూరగాయలు చూసినా కిలో ధర 50-60 రూపాయల మధ్యలోనో.. ఇంకా తక్కువగానో ఉంది. కానీ జూన్‌ నెల ఆరంభం నుంచి కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. జనాలు ఎక్కువగా వాడే ఉల్లి, టమాటా రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. వీటి ధర 60 నుంచి 100 రూపాయల మధ్య ఉంది. ఇక కొన్ని కూరగాయల ధరలైతే ఏకంగా సెంచరీ దాటేశాయి. పచ్చిమిర్చి, బీరకాయ వంటి వాటి ధరలైతే 150 రూపాయలకు చేరుకున్నాయి. పెరుగుతున్న ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ధరలు ఇలా మండిపోతే ఏం కొనాలి.. ఏం తినాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక టమాటా పరుగు ఆపడం లేదు. ఏకంగా 200 రూపాయలకు చేరింది. ఆ వివరాలు..

బక్రీద్‌ సందర్భంగా టమాటా ధర ఏకంగా కిలో 200 రూపాయలకు చేరింది. కాకపోతే అది మన దగ్గర కాదు పాకిస్తాన్‌లో. గత కొన్ని నెలలుగా పాక్‌లో నిత్యవసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. కిలో గోధుమ పిండి ఏకంగా 200 రూపాయలు పలికింది. తీవ్రమైన ద్రవ్యోల్భణం కారణంగా రేట్లు పైపైకి దూసుకుపోతున్నాయి. ఇక బక్రీద్‌ నాడు టమాటా కొండెక్కి కూర్చుంది. కిలో 200 రూపాయలకు పైగా పలికింది. ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ ప్రకారం.. పాక్‌ ప్రభుత్వం కిలో టమాటా ధరను 100 రూపాయలుగా నిర్ణయించింది. కానీ బహరింగ మార్కెట్‌లో ఎక్కడా ఈ రేటుకు టమాటాను విక్రయించలేదు. బయట కిలో టమాను ఏకంగా 200 రూపాయలకు పైగా విక్రయించారు. దాంతో జనాలు పండగ పూట తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. బక్రీద్‌ పండుగకు 2 రోజుల ముందు వరకు 100 రూపాయలు ఉన్న ధర.. పండుగ ముందు రోజే ఏకంగా వంద పెరగడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

భారత్‌లో కూడా పెరిగిన టమాటా రేటు..

ఇక మన దేశంలో కూడా టామాటా రేటు భారీగా పెరుగుతుంది. గత నెల వరకు మన దగ్గర టమాటా రేటు 15-20 రూపాయలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా కిలో రేటు 50-60 రూపాయలకు చేరింది. ఎండ తీవ్రత, సరైన వర్షాలు లేకపోవడం వంటి కారణాల చేత ఈ ఏడాది కూడా టమాటా రేటు చుక్కలను తాకుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా టమాట ధర భారీగానే పెరిగింది. హోల్‌సేల్‌ ధరలకైతే.. కిలో 35-50 రూపాయలకు విక్రయిస్తుండగా.. బహిరంగ మార్కెట్‌లో మాత్రం కిలో టమాటాను 60 రూపాయలకు అమ్ముతున్నారు.

గత ఏడాదితో పోలిస్తే.. ఈ రెండు, మూడు వారాల్లోనే ధరలు రెండింతలు పెరిగాయిని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ఇక ఆదివారం నాడు బెంగళూరు టమాటా రిటైల్‌లో కిలో ఏకంగా 80 రూపాయలకు అమ్మారు. మరో 40-60 రోజుల పాటు ధరలు ఇలానే ఉంటాయి అంటున్నారు. కాబట్టి సామాన్యులకు ఇబ్బందులు తప్పవు.

Show comments