Arjun Suravaram
తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. అలానే తాజాగా ఓ ఘోర పడవ ప్రమాదం జరిగింది. సముద్రంలో పడవ బోల్తా పడి 33 మంది జలసమాధి అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చర్యలు ప్రారంభించారు.
తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. అలానే తాజాగా ఓ ఘోర పడవ ప్రమాదం జరిగింది. సముద్రంలో పడవ బోల్తా పడి 33 మంది జలసమాధి అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చర్యలు ప్రారంభించారు.
Arjun Suravaram
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఇలా తరచూ జరిగే వివిధ ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే తరచూ పడవ ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు జల సమాధి అయ్యారు. ఇటీవలే బంగ్లా దేశ్ లో జరిగిన ఓ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మృతి చెందారు. ఓ స్కూల్ బస్సు చెరువులోకి వెళ్లడంతో 10 మంది విద్యార్థులు నీట ముగిని చనిపోయారు. తాజాగా మరో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. పడవ బోల్తా పడి 33 మంది మరణించారు.
సోమవారం రాత్రి ఎర్ర సముద్రం ప్రాంతంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలో వెళ్తున్న ఓ బోటు బోల్తా పడి.. 33 మంది చనిపోయారు. వీరందరు ఇథియోపియా వలసదారులుగా స్థానిక అధికారులు గుర్తించారు. యెమోన్ నుంచి ఇథియోపియాకు 77 మందితో ఓ పడవ బయల్దేరింది. ఈక్రమంలోనే ఈ క్రమంలోనే పడవ జిబౌటీ తీరం సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. జిబౌటీ వద్దకు రాగానే అధిక బరువు కారణంగా ఆ పడవ బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 77 మంది ఒక్కసారిగా నీటిలో పడిపోయినట్లు సమాచారం. ఇక ప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న తీర రక్షక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.
నీటిలో మునిగిపోతున్న 20 మందిని తీర రక్షక సిబ్బంది కాపాడారు. రక్షించారు. మరికొంతమంది ఆచూకి తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ ప్రమాదంలో 33 మంది దుర్మరణం చెందారు. ఇందులో కొందరు పిల్లలు, మహిళలు కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈఘటన గురించి మంగళవారం ఇంటర్నెషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఆఫ్రిక ఖండ తీర ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నే ఉంటాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రం, మధ్యధార సముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో వలదారులు ఇతర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ఈక్రమంలో అధిక సంఖ్యలో వలసదారులు పడవల్లో ప్రయాణం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.
తాజాగా కూడా సామార్థ్యానికి మించి ఎక్కువగా ప్రయాణం చేయడం వల్లనే ఈప్రమాదం చోటుచేసుకుందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మన దేశంలో కూడా తరచూ ఏదో ఒక ప్రాంతంలో పడవ ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని రోజుల క్రితం యమునా నదిలో పడవ ప్రమాదం జరిగి 7 మంది మరణించారు. నదికి ఓ వైపు ఉన్న గ్రామం నుంచి మరోవైపున ఉన్న గ్రామానికి వెళ్లేందుకు చాలా మంది పడవ ఎక్కారు. సామార్థ్యానికి మించి ప్రయాణం చేయడం కారణంగా ప్రమాదం జరిగి..7 మంది మరణించారు.
❗️ Tragedy as boat capsizes off #Djibouti coast with 77 migrants on board including children. At least 28 missing. 16 dead. @DjiboutiIOM supporting local authorities with search and rescue effort. pic.twitter.com/s4L7ASNW4o
— IOM – UN Migration News (@UNMigrationNews) April 23, 2024