iDreamPost
android-app
ios-app

వీడియో: భర్త ప్రియురాలికి షాకిచ్చిన భార్య.. జుట్టుపట్టి కొట్టి పగ తీర్చుకుంది!

వీడియో: భర్త ప్రియురాలికి షాకిచ్చిన భార్య.. జుట్టుపట్టి కొట్టి పగ తీర్చుకుంది!

పెళ్లైన కొందరు భార్యాభర్తలు కట్టుకున్న వాళ్లతో బుద్దిగా సంసారం చేయకుండా సీక్రెట్ గా మరో కుంపటిని ఏర్పరుచుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.., ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు చీకటి కాపురాలను కొనసాగిస్తూ చివరికి కట్టుకున్న వాళ్లకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ మోసాన్ని తట్టుకోలేక వాళ్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జుట్టుపట్టి కొట్టి పగ తీర్చుకుంటుంటారు. అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవల యూఎస్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూఎస్ లోని లాస్ వెగాస్ లో మైక్ హ్యారీస్- ఎరిన్ హ్యారిస్(42) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే భర్త మైక్ హ్యారిస్ పెర్టుసిల్లా (24) అనే యువతిని ఇష్టపడ్డాడు. దీంతో గత కొంత కాలం నుంచి ప్రియురాలితో మైక్ హ్యారిస్ డేటింగ్ లో ఉన్నాడు. ఇదే విషయం ఇటీవల అతని భార్య ఎరిన్ హ్యారిస్ కు తెలిసింది. ఇదే విషయంపై భార్యాభర్తలు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. దీంతో ఎరిన్ హ్యారిస్ భర్త ప్రియురాలిపై పగ పెంచుకుంది.

ఆమె కనిపిస్తే గట్టిగా బుద్ది చెప్పాలని ఎదురు చూస్తుంది. ఆ సమయం కూడా రానే వచ్చింది. ఈ నెల 12న ఓ కార్యక్రమంలో ఎరిన్ హ్యారిస్ కు భర్త ప్రియురాలైన పెర్టుసిల్లా కనిపించింది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ మహిళ.. అందరి ముందే ఆ యువతిని జుట్టు పట్టి కొట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. అక్కడున్న కొందరు వీరి కొట్లాటను చూసి నవ్వుకుంటే, మరి కొందర మాత్రం.. సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: వీడియో: అత్తా కోడళ్ల ఫైటింగ్.. వీడియో తీసిన కొడుకు

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş