Sunita Williams: డేంజర్‌లో సునీతా విలియమ్స్..? అంతరిక్షంలో ఏం జరుగుతుందంటే..?

డేంజర్‌లో సునీతా విలియమ్స్..? అంతరిక్షంలో ఏం జరుగుతుందంటే..?

సునీతా విలియమ్స్ రోదసి యాత్ర ఆందోళనకరంగా మారింది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో గత నెల 5 తేదీని అంతరిక్షానికి వెళ్లారు సునీత అండ్ విల్ మోర్. 14నే తిరిగి రావాల్సి ఉండగా.. హీలియం గ్యాస్ లీక్ సమస్యలు తలెత్తడంతో..

సునీతా విలియమ్స్ రోదసి యాత్ర ఆందోళనకరంగా మారింది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో గత నెల 5 తేదీని అంతరిక్షానికి వెళ్లారు సునీత అండ్ విల్ మోర్. 14నే తిరిగి రావాల్సి ఉండగా.. హీలియం గ్యాస్ లీక్ సమస్యలు తలెత్తడంతో..

వ్యోమగామి సునీత విలియమ్స్ తిరిగి భూమిని చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. గత నెల 5న భారత సంతతికి చెందిన ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ అమెరికాకు చెందిన మరో వ్యోమగామి విల్ మోర్‌తో కలిసి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో అక్కడకు చేరుకోగా.. 14వ తేదీకి భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది. అయితే వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో ప్రయాణం 26వ తేదీకి వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. టెక్నికల్ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇద్దరు ఆస్ట్రోనట్స్ అక్కడే చిక్కుకుపోయారు. జులై 6కి తిరిగి రావొచ్చునని భావిస్తున్నారు. హీలియం గ్యాస్ లీకవ్వడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పుడు మరో ఆందోళన నెలకొంది.

ఇప్పుడు సునీతా విలియమ్స్, విల్ మోర్ భూమి మీద రావడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చునని నాసా వెల్లడించింది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌ మరమ్మత్తులు పూర్తయితేనే భూమి మీదకు వచ్చే ఛాన్స్ ఏర్పడింది. ఇప్పుడు అందులో చిక్కుకుపోయిన ఆస్ట్రోనట్లు ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. మైక్రో గ్రావిటీ, రేడియేషన్, ప్రత్యేక వాతావరణ పరిస్థితులు వల్ల వ్యోమోగాములు అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడే అవకాశాలు ఉంది. అలాగే ఎముకల బలహీనత ఏర్పడవచ్చునని తెలుస్తుంది. కిడ్నీల వ్యవస్థపైనా ప్రభావితం పడుతుందని సమాచారం. కాల్షియం పెరిగిపోయి.. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలుంటాయని తెలుస్తుంది.

కంటి సమస్యలు, దృష్టి లోపం వంటి సమస్యలు వెంటాడతాయి. రేడియేషన్ ఎక్స్ పోజర్ ప్రభావం వల్ల క్యాన్సర్ వంటి ముప్పు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇప్పటికే ఓ బ్యాక్టీరియా అంతరిక్ష కేంద్రంలో ఉందని  నాసా ప్రకటించింది. దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఎదురౌతాయని భావిస్తున్నారు. సాధారణంగా అంతరక్షంలోకి వెళితే.. భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇప్పుడు ఏకంగా కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోవాల్సి రావడంతో ఆరోగ్య సమస్యలు జీవితాంతం వెంటాడే అవకాశం ఉందని తెలుస్తుంది. కఠిన ఆరోగ్య నియమాలు పాటించినా కూడా సమస్యలు తలెత్తవచ్చునని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. స్టార్ లైనర్ ఇంధన సామర్థ్యం కూడా 45 రోజులు మాత్రమే. ఇప్పటికే 25 రోజులు పూర్తయ్యాయి. ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోగా సునీతా విలియమ్స్ భూమికి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ పనిచేయకపోతే.. మరో స్పేస్ క్రాఫ్ట్ ను పంపించి.. భూమి మీదకు తిరిగి తీసుకు రావచ్చునని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సునీతా చాలా ధైర్యవంతురాలని, ఆమెను ఇలాంటి సమస్యలు ఏమీ చేయవన్న ధీమాతో ఉన్నారు ఆమె స్టామినా తెలిసిన సైంటిస్టులు.

Show comments