పేరెంట్స్ కి గుడ్ న్యూస్… ఒక బిడ్డను కంటే రూ.61 లక్షలు..!

ప్రపంచం వ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరిగి పోతుంది. ఈ పెరుగుదల అనేది అన్ని దేశాల్లో ఒకేలా లేదు. కొన్ని దేశాల్లో గణనీయంగా పెరుగుతుంటే.. మరికొన్ని దేశాల్లో జనాభా కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఓదేశం.. అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ప్రపంచం వ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరిగి పోతుంది. ఈ పెరుగుదల అనేది అన్ని దేశాల్లో ఒకేలా లేదు. కొన్ని దేశాల్లో గణనీయంగా పెరుగుతుంటే.. మరికొన్ని దేశాల్లో జనాభా కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఓదేశం.. అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరిగి పోతుంది. అయితే జనాభా పెరుగుదల అనేది అన్ని దేశాల్లో ఒకేలా లేదు. కొన్ని దేశాల్లో గణనీయంగా పెరుగుతుంటే.. మరికొన్ని దేశాల్లో జనాభా కొరత ఏర్పడుతుంది. అంటే ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం భిన్నంగా ఈ సంఖ్య ఉంటుంది. జనాభ పెరుగుదల ఎక్కువ ఉన్న దేశాలు నియంత్రణ కోసం అనేక షరతులు, ప్రోత్సహాకాలు అందిస్తున్నాయి. అలానే జనాభా సంక్షోభం ఉన్న దేశాలు వారి సంఖ్యను పెంచేందుకు భారీగా నగదు ప్రోత్సహాకాలు అందిస్తున్నాయి. గతంలో చైనాలోని ఓ ప్రావిన్స్ పిల్లలను కంటే 20 లక్షల వరకు ఇస్తామని ప్రకటించింది. తాజాగా ఓ దేశం ఏకంగా ఒక బిడ్డను కంటే.. 61 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి… ఆ దేశం, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు వివిధ సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాలు, ప్రకృతి సంక్షోభాలు, రాజ్యాంగ సంక్షోభం, ఆహార సంక్షోభం, ఇంధన సంక్షోభం వంటివి ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని దేశాలు ఏకంగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, రష్యా, సౌత్ కొరియా వంటి దేశాలు గతంలో జనాభా నియంత్రణకు తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

తాజాగా వీటిలో కొన్ని దేశాలు మరింత దారుణంగా ఉంది. అలాంటి దేశాల్లో సౌత్ కొరియా ఒకటి.  ఈ క్రమంలోనే దక్షిణ కొరియా.. తమ దేశంలో జనన రేటును పెంచేందుకు వినూత్న చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. జనాభాను పెంచేలా కృషి చేస్తున్న తల్లిదండ్రులకు అక్కడి ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పిల్లలకు జన్మనిచ్చే పేరెంట్స్ లో ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు ఇచ్చే అంశాన్ని ఆ దేశ ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 59 వేల పౌండ్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 61 లక్షల రూపాయలు అన్నమాట.

ఇక ఈ ప్రోగ్రామ్ ను అమలు చేసే ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆ ప్రభుత్వాం సర్వేకు సిద్ధమైనట్లు తెలిసింది. అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక, పౌర హక్కుల కమిషన్‌ ఓ పబ్లిక్‌ సర్వేను చేపట్టినట్లు  సమాచారం. ఈ సర్వే ఏప్రిల్‌ 17న ప్రారంభం కాగా పిల్లల్ని కనేవారికి అందించే ప్రోత్సాహాల కోసం ఏటా 12.9 బిలియన్‌ పౌండ్లు ఖర్చు చేయనంది. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1.3 లక్షల కోట్లు. ఈ మొత్తం ఆ దేశ బడ్జెట్ లో దాదాపు సగంగా ఉంది.

ఇక సౌత్ కొరియా దేశ జనభా విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో జననాల రేటు భారీగా తగ్గిపోయింది. ఏటకి ఏటా జననాల రేటు భారీగా తగ్గిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2023లో 0.72కు పడిపోయింది. 2023లో నమోదైన ఆ దేశ జనన రేటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టమని తేలింది. ఇక ఆ దేశంలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత.. వెరసి దంపతులు వివాహ బంధానికి, పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు. వీటితో పాటు మరికొన్ని ఇతర కారణాలతో ఈ దేశంలో జనాభా సంక్షోభం ఏర్పడింది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు దక్షిణ కొరియ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది.

Show comments