P Venkatesh
ఆహార కొరతకు సరికొత్త పరిష్కారం కనుగొన్నారు ఫిన్లాండ్ కు చెందిన కంపెనీ. టేక్నాలజీని వినియోగించుకుకని గాలి, కరెంట్ సాయంతో కృత్రిమంగా ఆహారాన్ని తయారు చేశారు.
ఆహార కొరతకు సరికొత్త పరిష్కారం కనుగొన్నారు ఫిన్లాండ్ కు చెందిన కంపెనీ. టేక్నాలజీని వినియోగించుకుకని గాలి, కరెంట్ సాయంతో కృత్రిమంగా ఆహారాన్ని తయారు చేశారు.
P Venkatesh
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో వినూత్నమైన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో మానవ జీవన శైలిలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నది. ఇదిలా ఉంటే ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోని ఆహార కొరతను తీర్చేందుకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. గాలి, కరెంటు సాయంతో ఆహారాన్ని తయారు చేశారు. ఈ అద్భుతమైన ప్రయోగానికి వేదికైంది ఫిన్లాండ్. ప్రపంచంలో జనాభా పెరుగుతున్న తరుణంలో ఇలాంటి ఆవిష్కరణ ఆహార కొరతను తీర్చేందుకు ఉపయోగపడనున్నది.
వరల్డ్ వైడ్ గా అర్థాకలితో గడుపుతున్నవారు, ఆకలితో అలమటించే వారు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఆహార ధాన్యాలు సరిపోవడం లేదు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కనిపెట్టింది ఫిన్ లాండ్ కు చెందిన సోలార్ ఫుడ్స్ అనే స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ ‘సొలీన్’ అనే ఒక ప్రొటీన్ పౌడర్‌ను తయారుచేసింది. దీని తయారీకి గాలి, కరెంట్ ను ఉపయోగించడం గమనార్హం. ఈ పౌడర్‌ను మనుషులు ఆహారంగా తీసుకోవచ్చని ఈ కంపెనీ చెప్తున్నది. ఫిన్‌లాండ్‌లోని నేషనల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఈ కొత్త ఆహారాన్ని కనుగొన్నట్టు సోలార్ ఫుడ్స్ సీఈవో డాక్టర్ పసి వైనిక్కా తెలిపారు.
హైడ్రోజెన్, కార్బన్ డయాక్సైడ్ ద్వారా పెరిగే ఒక రకమైన సూక్ష్మజీవితో ఈ ప్రొటీన్ పౌడర్‌ను తయారుచేసినట్టు కంపెనీ తెలిపింది. విద్యుత్తు ద్వారా హెచ్2, గాలి ద్వారా కార్బన్ డయాక్సైడ్ అందించి ట్యాంకుల్లో ఈ సూక్ష్మజీవిని పునరుత్పత్తి చేసిన్నట్టు తెలిపారు. ఈ సూక్ష్మజీవినే ఎండబెట్టి పౌడర్ చేస్తామని, పసుపు రంగులో ఉండే ఈ ప్రొటీన్ పౌడర్‌లో మానవ శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు, అమైనో యాసిడ్లు ఉంటాయని తెలిపారు. ఎండిన మాంసంలో ఉండే పోషకాలే దాదాపుగా ఇందులో కూడా ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు మొక్కల ద్వారా ఆహార పదార్థాలను సృష్టించగా.. ఇప్పుడు కృత్రిమంగా ఆహారాన్ని సృష్టించేందుకు మార్గం సుగమం అవుతుందంటూ పలువురు శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.