రోడ్డుపైకి దూసుకొచ్చిన విమానం.. వీడియో వైరల్

ఇటీవల వరుస విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిసార్లు టేకాఫ్ అయిన వెంటనే టెక్నికల్ వ్యవస్థలో లోపాల కారణంగా నేలపై కుప్పకూలిపోతున్నాయి.

ఇటీవల వరుస విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిసార్లు టేకాఫ్ అయిన వెంటనే టెక్నికల్ వ్యవస్థలో లోపాల కారణంగా నేలపై కుప్పకూలిపోతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కొంతకాలంగా వరుస విమాన ప్రమాదాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపాలు తలెత్తడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, రన్‌వేలపై ల్యాండింగ్ అయ్యే సమయంలో అదుపు తప్పడం, ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదాల్లో వందలమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి. కొన్నిసార్లు ప్రమాదాలను పైలట్లు ముందుగానే పసిగట్టి ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఓ విమానం కంట్రోల్ తప్పి రన్ వే పైకి దూసుకు వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. హైవే పై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో అక్కడ కారు నుజ్జు నుజ్జు అయ్యాయి. అదేంటీ.. రోడ్డు పై వాహనాలు ఢీ కొట్టుకుంటాయి.. గాల్లో ఎగిరే విమానం వచ్చి భూమిపై కారును ఎలా ఢీ కొట్టిందని ఆశ్చర్యపోతున్నారా? అదే వింత. ఈ విమాన ప్రమాదం మిన్ని యాపాలిస్ లో జరిగింది. మంగళవారం అమెరికా నగరంలోని మిన్నియాపాలిస్ లోని హైవే పై ఓ మినీ విమానం కూలిపోయింది. అక్కడ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టడంతో డ్రైవర్ , పైలట్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మిన్నెసోటాలోని బ్రూక్లీన్ పార్క్ లో ఉదయం పదిగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డు పై భారీ ఎత్తున వాహనాలు ఆగి గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మద్య విమానాలు హైవే పై కూడా ప్రయాణిస్తున్నాయి అని కొంతమంది, హైవే పై వాహనాలతోనే అనుకున్నాం.. ఇప్పుడు విమానాలతో కూడా ప్రమాదం పొంచి ఉంది.. జాగ్రత్త అంటూ ఫన్నీగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ విమాన ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments