iDreamPost
android-app
ios-app

బీచ్‌లో వాకింగ్ వెళ్లిన మహిళకు ఇసుకలో మెరుస్తూ కనిపించాయి. తీరా చూస్తే

ఓ మహిళా వాకింగ్ అని సరదాగా సముద్రం ఒడ్డుకు వెళ్లింది. దూరంగా ఏవో మెరుస్తూ కనిపించడంతో వెళ్లి చూడగా.. అదృష్టం తనను వరించిందని భావించింది

ఓ మహిళా వాకింగ్ అని సరదాగా సముద్రం ఒడ్డుకు వెళ్లింది. దూరంగా ఏవో మెరుస్తూ కనిపించడంతో వెళ్లి చూడగా.. అదృష్టం తనను వరించిందని భావించింది

బీచ్‌లో వాకింగ్ వెళ్లిన మహిళకు ఇసుకలో మెరుస్తూ కనిపించాయి. తీరా చూస్తే

రాజుల కాలంలో తమ రాజ్యంపై ఇతర దేశ రాజులు దండ యాత్ర చేసే సమయంలో తమ నిధి నిక్షేపాలను రహస్య ప్రాంతాల్లో దాచేవాళ్లు. అలాగే పరారయ్యే సమయంలో సముద్రాలు, ఓడల నుండి తరలించేవారు. బ్రిటీషులు కాలంలో కూడా మన దేశ సంపదను అలాగే దోచుకెళ్లారు వర్తకులు. మన దేశానికి వ్యాపారం పేరుతో ఇక్కడకు వచ్చి దేశ సంపదను కొల్లగొట్టినట్లు ఎన్నో కథనాలు ఉన్నాయి. అలాగే యుద్దాలు జరిగే సమయంలో దోచుకున్న సంపదను సముద్రాలు దాటించే సమయంలో ఓడలు మునిగి పోయి నీటి పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే పొలాల్లో, ఇంటి నిర్మాణాల్లోను దాచేవారు. అలా చాలా రాజుల సొమ్ము రాళ్ల పాలు అయ్యింది. ఇప్పటికీ ఎంతో సంపద నేల మాళిగల్లో, సముద్ర అడుగుల్లో, పొలాల్లో, భూగర్భంలో కలిసిపోతున్నాయి. ఎప్పుడో తవ్వకాలో బయటకు వస్తుంటాయి.

తాజాగా చెక్ రిపబ్లిక్‌లోని కుత్నా హో అనే ఒక చిన్న పట్టణంలోని ఓ బీచ్‌లో వాకింగ్‌కి వెళ్లిన ఒక మహిళకు ఇలాంటి అదృష్టమే వరించింది. సరదాగా వాకింగ్ వెళితే.. ఇసుకలో ఏవో మెరుస్తూ కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూడగా.. వెండి నాణేలు కనిపించాయి. అదే ప్రాంతంలో 2,150 కంటే ఎక్కువ పురాతన వెండి నాణేలు కనిపించాయి. ఇవి పురాతన నాణేలు. 1085 నుండి 1107 మధ్య కాలానికి చెందినవి అని నిపుణులు చెబుతున్నారు. వీటిని బహుశా ప్రేగ్‌లో తయారు చేసి.. ఆ తర్వాతి కాలంలో బోహెమియాకు తరలించి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో వెండి నాణేలు కాదు. రాగి, సీసం, ఇతర లోహాలు తయారు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నాణేలు ఎక్కువగా వెండితో తయారు చేయబడ్డాయని.. కొద్దిగా రాగి, సీసం, ఇతర లోహాలు కలిపి తయారు చేసినట్లు తెలిపారు.

నాణేల్లోని లోహాలను టెస్ట్ చేయడం ద్వారా, నిపుణులు వాటి చరిత్ర గురించి మరింత విశ్లేషణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిలిప్ వెలిమ్స్కీ అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ ఓల్డ్ కాయిన్స్ కొన్ని యుద్ధాల సమయంలో భూమిలో పాతిపెట్టి ఉండవచ్చు అని చెబుతున్నారు. వీటి విలువ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుందని, కోట్ల రూపాయాలు పలకవచ్చునని నిపుణుల అంచనా. గత పది సంవత్సరాలలో దొరికిన అతి పెద్ద నిధి ఇదేనని అక్కడి ప్రజలు చెబుతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నాణేలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, వాటిలో ఏ లోహాలు ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దొరికిన వాటిని 2025లో వీటిని ప్రదర్శకు పెట్టే అవకాశం ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి