iDreamPost
android-app
ios-app

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి! పోలీస్ అధికారి వెకిలి కామెంట్స్!

  • Author Soma Sekhar Updated - 09:51 PM, Wed - 13 September 23
  • Author Soma Sekhar Updated - 09:51 PM, Wed - 13 September 23
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి! పోలీస్ అధికారి వెకిలి కామెంట్స్!

కందుల జాహ్నవి(23).. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాకు చెందిన అమ్మాయి. గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 23వ తేదీనా రాత్రి 8 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా.. ఓ పోలీస్ వాహనం వచ్చి వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. కాగా.. కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే జాహ్నవి ప్రాణం పోయిందని ఆ తర్వాత తేలింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ఓ పోలీస్ అధికారి చేసిన వెకిలి కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జాహ్నవి మృతిపై ఆ పోలీస్ చేసిన కామెంట్స్ భారతీయులకు తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరి 23న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రమాదం గురించి ఓ అధికారి మాట్లాడిన వెకిలి మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కాగా.. జాహ్నవి యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. ఈ ఘటనపై గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్ కు సమాచారం అందిస్తూ.. తొలుత నవ్వులు చిందించాడు. అదీకాక ఆమె జీవితానికి వెల కట్టాడు. జాహ్నవి 23 ఏళ్ల ఏజ్ లో చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెకిలి మాటలు మాట్లాడాడు.

ఇక ఆర్డరర్ వ్యాఖ్యలకు సోలన్ ఎలాంటి సమాధానం ఇచ్చాడన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం అతడు మాట్లాడిన వెకిలి మాటలు వైరల్ కావడంతో.. సోమవారం అధికారులు ఈ వీడియోను రిలీజ్ చేసి, విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సియాటెల్ ప్రజలకు మరింత భద్రత కల్పించడం మా విధి.. ఈ ఘటనపై తాము కచ్చితంగా విచారణ చేపడతామని ప్రజలకు తెలిపేందుకే ఈ వీడియోను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆర్డరర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రవాస భారతీయులు. ఆమెకు న్యాయం చేయాలంటూ అక్కడి అధికారులను డిమాండ్ చేస్తున్నారు. కాగా.. జాహ్నవి ఈ డిసెంబర్ నెలలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో డిగ్రీ తీసుకోవాల్సి ఉంది. అంతలోనే ఇలాంటి ఘోరం చోటుచేసుకుంది. జాహ్నవి మృతిపై కింగ్ కౌంటీ అటార్నీ కార్యాలయం దర్యాప్తు చేస్తోంది.