కోటిన్నర జీతం, ఇల్లు, చాలా ఆఫర్స్ ఇస్తారట! ఈ జాబ్ చేయగలరా?

Good Salary and Allowances: విదేశాల్లో ఉద్యోగం చేస్తూ మంచి సంపాదన సంపాదించేవారికోసం ఓ దేశ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.. ఇంతకీ ఆ దేశం ఏదంటే..

Good Salary and Allowances: విదేశాల్లో ఉద్యోగం చేస్తూ మంచి సంపాదన సంపాదించేవారికోసం ఓ దేశ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.. ఇంతకీ ఆ దేశం ఏదంటే..

మంచి చదువు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవమైన పొజీషన్లో జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకోసం చాలా మంది విదేశాలకు వెళ్లి తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు చేసి బాగా డబ్బు సంపాదించి స్వదేశాలకు వచ్చేవారు ఎంతో మంది ఉన్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు ఇతర సాంకేతిక రంగంలో నిపుణులకు విదేశాల్లో మంచి ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయి. కాకపోతే తాము ఆశించినంత జీతభత్యాలు లేకపోవడంతో చాలామంది ఇక్కడే తమకు తగ్గ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఓ దేశం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.. కోటిన్నర జీతం,ఇల్లు తో పాటు అన్ని రకాల అలవెన్సులు కల్పిస్తామని ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

స్కాట్ లాండ్ లోని హేబ్రిడీస్ దీవుల సముదాయంలో యూఇస్ట్, బెన్ బెక్యూ దీవుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. సంవత్సరానికి కోటి యాభై లక్షల జీతంతో పాటు అన్ని అలవెన్సులు కల్పిస్తామని అంటున్నారు ప్రకటించింది ప్రభుత్వం. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే వైద్యులకు, ఉపాధ్యాయులకు మంచి ఉద్యోగంతో పాలు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని అధికారులు అంటున్నారు. ఈ దీవులకు దగ్గరలో ఉన్న రమ్ అనే మరో దీవిలో ఉపాధ్యాయులకు 68 వేల పౌండ్లు (భారత కరెన్సీలో 71.47 లక్షల రూపయాలు) అన్నమాట. స్కాట్ లాండ్ లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొంతకాలంగా ఉద్యోగుల కొరత ఉంది. ఈ సమస్యలను దూరం చేసుకునేందుకు అక్కడి అధికారులు పలు దేశాల నుంచి ఉద్యోగులను తమ దీవులకు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాల కోసం వచ్చేవారికి మంచి జీతం, పలు రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని పశ్చిమ దీవులు నేషనల్ సర్వీస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ గోర్డెన్ జెమిసన్ అన్నారు.

అంతేకాదు  ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉపాధి కల్పన కల్పిస్తామని ఆయన అన్నారు. ఇది మారుమూల ప్రాంతం కావడంతో ఉద్యోగస్తులు వచ్చేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇక్కడ వచ్చి సేవలందించే వైద్యులకు 40 శాతం అధిక జీతం ఇస్తామని అంటున్నారు. ఇక్కడికి వచ్చే వైద్యులు ఆరు దీవుల్లోని 4700 మందికి సేవలందించాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు తాము ఉన్న ప్రాంతం నుంచి దీవులకు వచ్చే అన్ని ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుందిని అంటున్నారు. అంతేకాదు వీరిని గోల్డెన్ హలో పేరుతో ఆహ్వానిస్తూ అందుకోసం 10వేల యూరోలను ప్రత్యేకంగా అందిస్తుంది. అధిక జీతంతో పాటు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల కొందిమంది ఇక్కడే స్థిరపడిపోయే అవకాశం ఉందని భావిస్తుంది అక్కడి ప్రభుత్వం.

రమ్ దీవిలోని కిమ్ లోచ్ అనే గ్రామంలో 40 మంది ఉన్నారు. ఇక్కడ పాఠశాలలో 5 గురు విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడికి వచ్చే ఉపాధ్యాయులకు 60 పౌండ్లతో పాటు మరో 5,500 పౌండ్ల అదనపు ఖర్చులకు ఇస్తామని హైలాండ్ కౌన్సిల్ చెబుతుంది. ఈ ఉద్యోగం చేసేందుకు కొంతమంది వచ్చారని.. నియామక ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఈ భూమి ఎక్కువగా స్కాటిష్ అధీనంలో ఉంది. ఆర్నమోర్చన్ ద్వీప కల్పంలోని కిల్చోన్ ప్రైమరీ స్కూల్ లో 15 మంది విద్యార్థులు ఉంటారని.. వీరికి విద్యాభోదన అందించేందుకు వచ్చే టీచర్ కు 53 వేల పౌండ్లు ఇస్తామని ప్రకటన ఇచ్చారు 2022 లో షెట్ లాండ్ దీవిలో ఉన్న మరో దీవిలో కూడా ప్రైమరీ స్కూల్ లో 62 వేల పౌండ్ల జీతంతో పాటు త్రిబుల్ బెడ్ రూమ్, ఇతర అలవెన్సులు ఇస్తామని ప్రకటించారు. ఈ దివిలో 23 మంది ఉన్నారు.. ఇక్కడ మౌళిక సదుపాయాలకు దగ్గట్టు ఉద్యోగస్థులకు అన్ని వసతుల ఏర్పాటు చేస్తామని హైలాండ్ కౌన్సిల్ చెబుతుంది.

ఇక్కడ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నాం.. కొత్తగా ఎంపికైన హెడ్ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే కొంత వరకు నిధులు కేటాయించాం.. ఇతర స్కూల్స్ లో విద్యాభోదన చెప్పేవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని కౌన్సిల్ అధికార ప్రతినిధి చెప్పారు. మరి ఇంకెందుకు ఆలస్యం మంచి సాలరీతో పాటు అలవెన్సులు కూడా ప్రకటించిన ఈ దివుల్లో ఉద్యోగం చేసేందుకు ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments