జపాన్ విమానాశ్రయంలో కత్తెర కోసం.. 36 విమానాలు రద్దు!

Japan Airport: ఓ ఎయిర్ పోర్టులో కత్తెర కనిపించకుండాపోయింది. అయితే ఇందులో విచిత్రం ఏమిలేదు..కానీ. దాని కారణంగా ఏకంగా 36 విమానాలు రద్దయ్యాయి. అలానే 200 ఫ్లైట్లు ఆలస్యంగా నడిచాయి.

Japan Airport: ఓ ఎయిర్ పోర్టులో కత్తెర కనిపించకుండాపోయింది. అయితే ఇందులో విచిత్రం ఏమిలేదు..కానీ. దాని కారణంగా ఏకంగా 36 విమానాలు రద్దయ్యాయి. అలానే 200 ఫ్లైట్లు ఆలస్యంగా నడిచాయి.

ఈ మధ్యకాలంలో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరిగింది. కొన్నేళ్ల క్రితం విమానాలు ఎక్కడం అంటే చాలా గొప్పగా అనిపించేది. ప్రస్తుతం మాత్రం చాలా కామన్ అయ్యేంది. ఇది ఇలా ఉంటే..కొన్ని కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో  విమానాలు రద్దు అవుతుంటాయి. వాతావరణం అనుకూలించగా, ఇతర సెక్యూరిటి కారణాలతో  ఫ్లైట్లను రద్దు చేస్తుంటారు. అయితే తాజాగా జపాన్ లోని ఓ ఎయిర్ పోర్టు మాత్రం విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ చిన్న కారణంతో ఏకంగా 36 విమానాలు రద్దు అయ్యాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

జపాన్ లో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్టులో ఒకటైనా చిటోస్ ఎయిర్ పోర్టు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎయిర్ పోర్టు జపాన్ లోని హక్కైడో ఐల్యాండ్ లో ఉంది. ఆ విమాశ్రయంలోని ఓ రిటైల్ స్టోర్ లో కత్తెర కనిపించకుండా పోయింది. దీంతో ఈ విషయాన్ని ఎయిర్ ప ర్టు అధికారులకు సదరు స్టోర్ సిబ్బంది తెలియజేశారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది ఆ కత్తెర కోసం  సెర్చింగ్ మొదటలు పెట్టారు. విమానాశ్రాయానికి వచ్చే ప్రయాణికులను ఆపిమరీ కత్తెర కోసం జల్లెడ పట్టారు. అలా కొన్ని క్షణాలు మాత్రమే కాదు.. ఏకంగా రెండు గంటల పాటు కత్తెర కోసం వెతికారు.

ఈ క్రమంలోనే ఆ ఎయిర్ పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 36 విమానాలు రద్దయ్యాయి. అలాగే వందలాది మంది ప్రయాణికులతో క్యూలైన్లు పెరగడంతో 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆఖరికి ఆ కత్తెర విషయంలో సూపర్ ట్విస్ట్ ఎదురైంది. అంతేకాక చివరకు అధికారులు, స్టోర్ సిబ్బంది ఆశ్చర్యపోయే ఘటన జరగింది. కనిపించకుండా పోయిన కత్తెరను అదే స్టోర్​లో గుర్తించారు. అదే విషయాన్ని అధికారులు వెల్లడించారు. మొత్తంగా కత్తెర కోసం విమానాలు రద్దు కావడం, ఆలస్యంగా నడవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి.. ఈ విచిత్ర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments