మీమ్స్‌లో కనిపించే ఈ కుర్రాడు ఒక్క స్టిల్‌తో తండ్రిని కాపాడుకున్నాడు

Sammy Griner: 8 ఏళ్ల వయసులో వంద రూపాయలు సంపాదించడమే కష్టం. కానీ 8 ఏళ్ల వయసులో ఈ మీమ్ కుర్రాడు తన తండ్రి ఆపరేషన్ కోసం ఏకంగా 61 లక్షలు సంపాదించాడు. అలా చిన్న వయసులోనే తండ్రిని కాపాడిన రియల్ హీరో అయ్యాడు. ఆ డబ్బు సంపాదించడానికి కారణం అతని స్టిల్లే.

Sammy Griner: 8 ఏళ్ల వయసులో వంద రూపాయలు సంపాదించడమే కష్టం. కానీ 8 ఏళ్ల వయసులో ఈ మీమ్ కుర్రాడు తన తండ్రి ఆపరేషన్ కోసం ఏకంగా 61 లక్షలు సంపాదించాడు. అలా చిన్న వయసులోనే తండ్రిని కాపాడిన రియల్ హీరో అయ్యాడు. ఆ డబ్బు సంపాదించడానికి కారణం అతని స్టిల్లే.

మీమ్స్ లో బ్రహ్మానందం, అలీ వంటి కమెడియన్లు, హీరోల పిక్స్ మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తుల పిక్స్ కూడా కనిపిస్తుంటాయి. ఆ మీమ్స్ వల్ల వాళ్ళు బాగా వైరల్ అవుతారు. ఫోటోలు, వాళ్ళు మాట్లాడిన మాటలు వైరల్ అవుతుంటాయి. ట్రాలర్స్, మీమర్స్ వాళ్ళ ఫోటోలను, వీడియోలను ఫన్ కోసం వాడుతుంటారు. ఈ క్రమంలో ఆ ఫోటోల్లో, వీడియోల్లో ఉన్న వాళ్ళు చాలా మంది సెలబ్రిటీలు అవుతారు. సక్సెస్ అవుతారు. పై ఫోటోలో కనిపించే బాబు కూడా అలా ఫేమస్ అయినవాడే. బీచ్ లో చేత్తో ఇసుక పట్టుకుని పెదాలు బిగించి కసిగా చూస్తున్న ఈ బాబు పేరు సామీ గ్రైనర్. ఫ్లోరిడాకు చెందిన సామీ గ్రైనర్ 11 నెలల వయసులో ఉన్నప్పుడు 2007లో దిగిన ఫోటో అది. బీచ్ లో ఆడుకుంటుండగా కుర్రాడి తల్లి లేనీ ఈ ఫోటోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే ఆ ఫోటో 2010లో వైరల్ అయ్యింది. చాలా మీమ్స్ లో ఈ కుర్రాడి పిక్ కనిపించేది. దీంతో ఇతనికి సక్సెస్ కిడ్ అన్న పేరు వచ్చింది. నాలుగేళ్ల వయసులోనే సక్సెస్ అయిన కిడ్ గా పేరొచ్చింది. ఈ సక్సెస్ తోనే సామీ గ్రైనర్ తన తండ్రికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కి డబ్బులు సంపాదించగలిగాడు. అదెలా సాధ్యం అంటే.. కుర్రాడి తల్లి తన బాబు ఫేమ్ ని మంచి పని కోసం వాడాలని భావించారు. తన భర్త జస్టిన్ కిడ్నీ మార్పిడి కోసం ఫండ్స్ కలెక్ట్ చేయాలని అనుకున్నారు. తన భర్త కిడ్నీ మార్పిడి కోసం గో ఫండ్ మీ అనే వెబ్ సైట్ లో ఒక పోస్ట్ చేశారు. చికిత్సకు 75 వేల డాలర్లు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో.. ఆమె 75 వేల డాలర్ల సాయం కోసం ఫండ్స్ రైజ్ చేశారు.

తమ కొడుకు ఫోటో పెట్టి ఫండ్స్ అడిగారు. దీంతో ఆ కుర్రాడి క్రేజ్ కి ఎంతోమంది ముందుకొచ్చి సహాయం చేశారు. 75 వేల డాలర్లు అడిగితే లక్ష డాలర్ల కంటే ఎక్కువ ఫండ్స్ వచ్చాయి. కావాల్సిన డబ్బుని కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీకి ఖర్చు పెట్టి పై డబ్బుని మెడికల్ కేర్ కోసం ఖర్చు చేసారు. ఈ సర్జరీ 2015లో ఆగస్టు నెలలో జరిగింది. అప్పటికి సామీ వయసు 8 ఏళ్లు. ఇప్పుడు ఈ కుర్రాడి వయసు 17 ఏళ్లు. సామీ నాన్నమ్మ కూడా కిడ్నీ వ్యాధితో చనిపోయింది. కానీ సామీ తనకు తెలియకుండానే ఇచ్చిన స్టిల్ తో తన తండ్రిని కాపాడుకున్నాడు. సామీ ప్రస్తుతం స్కూల్లో చదువుకుంటున్నాడు. సామీ వల్ల తన భర్తను కాపాడుకున్నందుకు లేనీ కృతజ్ఞతగా సామీ గ్రైనర్ అప్పట్లో ఇచ్చిన స్టిల్ ని చిన్న బొమ్మగా తయారు చేయించారు.

Show comments