iDreamPost
android-app
ios-app

ఫేస్ బుక్ లవ్: పాక్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజు!

ఫేస్ బుక్ లవ్: పాక్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజు!

ఈ మధ్యకాలంలో ప్రేమ దేశాలు దాటుతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. పబ్ జీలో ప్రేమించుకుని సీమా హైదరీ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రియుడిని పెళ్లి చేసుకుని హిందువుగా మారింది. ఆ తర్వాత ఆ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఓ మహిళ ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమలో పడి బిడ్డతో సహా పోలాండ్ నుంచి ఇండియా వచ్చిన విషయం కూడా తెలుసు. ఆ తర్వతా వీటికి భిన్నంగా అంజు అనే యువతి ఫేస్ బుక్ ప్రేమ కోసం పాకిస్తాన్ వెళ్లింది. ఇప్పుడు ఆమె ప్రియుడిని వివాహం కూడా చేసుకుంది.

ఫేస్ బుక్ లో వారి మధ్య స్నేహం కుదిరింది అది కాస్తా ప్రేమగా మారింది. ఆమె ప్రేమించిన వ్యక్తి కోసం ఏకంగా దేశం కూడా దాటేసింది. అంజు తన ప్రియుడు నస్రుల్లా కోసం పాకిస్తాన్ ఖైబెర్ పక్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఓ చిన్న కుగ్రామానికి వెళ్లింది. అక్కడికి వెళ్లడం మాత్రమే కాకుండా.. అక్కడ ఇస్లాం మతం స్వీకరించి ఫాతిమాగా మారినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇస్లాం సంప్రదాయం ప్రకారం అప్పర్ డిర్ లో ఆమె తన ప్రియుడుని వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సినిమాటిక్ లెవల్లో వాళ్లు కలిసున్న విజువల్స్ ఉన్నాయి. ఎత్తైన కొండలు, బ్రిడ్జ్ ఇలా ఆ ప్రాంతం మొతతాన్ని చూపిస్తూ వీళ్ల వీడియో సాగింది.

వీళ్ల పెళ్లి విషయాన్ని మలాకండ్ డివిజన్ డెప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ నసీర్ మహ్మద్ ధ్రువీకరించారు. అంజు(35) ఇస్లాం మతం స్వీకరించి ఫాతిమాగా మారిన తర్వాత నస్రుల్లా(29)తో వివాహం జరిగినట్లు తెలిపారు. డిర్ బాలా డిస్ట్రిక్ట్ కోర్టులో కుటుంబ సభ్యులు, పోలీసులు, లాయర్ల సమక్షంలో వీళ్ల వివాహం జరిగినట్లు చెప్పారు. అంతేకాకుండా వివాహం తర్వాత భద్రతా కారణాల రీత్యా.. పోలీసుల సంరక్షణలో ఆమెను అత్తగారింట్లో దిగబెట్టినట్లు చెప్పారు. నిజానికి ఫాతిమాగా మారిన అంజు ఒకరోజు ముందు నస్రుల్లాని వివాహం చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది. అలాగే తన వీసా గడువు ముగిసిన తర్వాత ఆగస్టు 20న తిరిగి ఇండియా వచ్చేస్తానని కూడా వ్యాఖ్యానించింది. కానీ, అనూహ్యంగా ఫాతిమాగా మారిపోయి నస్రుల్లాను వివాహం చేసుకుంది.

Indian woman married pakistan boy

మరోవైపు నస్రుల్లా కూడా మీడియాతో మాట్లాడే సమయంలో వారి మధ్య ప్రేమ అని వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. అంజుని వివాహం చేసుకునే ఉద్దేశం తనకు లేదని వెల్లడించాడు. అంజుకు ఇండియాలో ఇప్పటికే వివాహం జరిగింది. ఆమె భర్త అరవింద్ రాజస్థాన్ లో ఉంటారు. అతని భార్య తిరిగి వస్తుందనే నమ్మకంతోనే ఉన్నాడు. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఇప్పటికే ఆమె మానసికంగా కాస్త డిస్టర్బ్ గా ఉన్నట్లు తండ్రి వెల్లడించారు. అయితే ఎవరికీ చెప్పకుండా పాకిస్తాన్ వెళ్లడం ఆమె తప్పే అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఆమెకు ఎలాంటి ఎపైర్ లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అంజు అలియాస్ ఫాతిమా- నస్రుల్లా వివాహం వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş