iDreamPost
android-app
ios-app

వీడియో: పైలట్ కు అస్వస్థత.. ఫ్లైల్ట్ నడిపిన మహిళా ప్యాసింజర్!

వీడియో: పైలట్ కు అస్వస్థత.. ఫ్లైల్ట్ నడిపిన మహిళా ప్యాసింజర్!

సాధారణంగా విమానం ఎక్కుతున్నాం అంటే జీవితం మీద సగం ఆశ వదులుకోవాలి అంటారు. కానీ, విమాన ప్రయాణం మరీ అంత భయంకరంగా ఏమీ ఉండదులెండి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు కొన్ని లక్షల విమానాలు కోట్ల మంది ప్రయాణికులను ఎంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ప్రమాదాలు జరగడం.. ప్రయాణికుల ప్రాణాలు పోవడం కూడా చూశాం. తాజాగా ఒక విమాన ప్రమాదం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్ లోని విన్ యార్డ్ విమానాశ్రయంలో జరిగింది. శనివారం మధ్యాహ్నం న్యూయార్క్ వెస్ట్ చెస్టర్ కౌంటీ నుంచి ఒక మినీ విమానం విన్ యార్డ్ ఎయిర్ పోర్టుకు బయల్దేరింది. విమానాశ్రయం వరకు అంతా బాగానే ఉంది. కానీ, ల్యాండింగ్ చేయాల్సిన సమయంలో 79 ఏళ్ల పైలట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన మహిళా ప్రయాణికురాలు ఆ ఫ్లైట్ కంట్రోల్ తీసుకున్నారు. సేఫ్ గా ల్యాండ్ చేసేందుకు ఎంతో కృషి చేశారు. కానీ, రన్ వే సమీపంలోకి రాగానే మినీ ఫ్లైట్ పక్కకు ఒరిగింది. ఈ క్రాష్ ల్యాండింగ్ లో ఫ్లైట్ స్వల్పంగా ధ్వంసమైంది. ఎడమ రెక్క దెబ్బతిన్నట్లు తెలిపారు.

హుటాహుటిన చేరుకున్న రెస్క్యూ టీమ్ పైలట్, మహిళా ప్యాసెంజర్ ను సురక్షితంగా బయటకు తీశారు. అయితే పైలట్ ఆరోగ్య పరిస్థితి విమషమించగా.. మహిళ మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడింది. ఆస్పత్రితో చికిత్స తర్వాత మహిళా ప్రయాణికురాలు డిస్చార్జ్ అయినట్లు తెలిపారు. పైలట్, ప్రయాణికురాలు ఇద్దరూ కనెటికట్ ప్రాంతానికి చెందిన వారిగా చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు, ఫెడరల్ ఏవియేషన్ విభాగాలు కూడా దర్యాప్తు ప్రారంభించాయి. ఆ సమయానికి మహిళా ప్యాసింజర్ స్పందించింది కాబట్టే అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారని నెటిజన్స్ చెబుతున్నారు. నిజానికి ఆమె ధైర్యాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రాష్ ల్యాండింగ్ కు సంబంధించిన వార్తలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.