iDreamPost
android-app
ios-app

పాక్ కొత్త ప్రధానికి 60 ఏళ్లలో 5 పెళ్లిళ్లు.. కోట్లలో ఆస్తులు!

  • Published Mar 04, 2024 | 8:53 PM Updated Updated Mar 04, 2024 | 8:53 PM

Pakistan PM has 5 Marriages: ఎట్టకేలకు పాక్ రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చిన ట్విస్ట్ కి పులిస్టాప్ పడింది. పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టారు.

Pakistan PM has 5 Marriages: ఎట్టకేలకు పాక్ రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చిన ట్విస్ట్ కి పులిస్టాప్ పడింది. పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టారు.

పాక్ కొత్త ప్రధానికి 60 ఏళ్లలో 5 పెళ్లిళ్లు.. కోట్లలో ఆస్తులు!

ఇటీవల పాకిస్థాన్ లో జరిగిన ఎలక్షన్లు తీవ్ర ఉత్కంఠ రేపాయి. ఇక్కడ ఎన్నికలు నువ్వా.. నేనా అన్న చందంగా సాగాయి. కొన్నిరోజులు పాక్ లో పొలిటికల్ హై డ్రామా నడిచింది. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ పదవిలో కూర్చున్న షెబాజ్ షరీఫ్.. మళ్లీ ఆ పాఠాన్ని దక్కించుకున్నారు. సుధీర్ఘ రాజకీయ సంక్షోభం తర్వాత పార్ 24 వ ప్రధానిగా షెబాజాజ్ షరీప్ బాధ్యతలు చేపట్టారు. ఆయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. పాకిస్థాన్ లో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. పాకిస్థాన్ రాజకీయ నేతల్లో అత్యంత ధనవంతుల్లో ఒకరు షెబాజ్ షరీఫ్. తాజాగా ఆయన పెళ్లిళ్ల విషయంపై ఇప్పుడు చర్చనడుస్తుంది. వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు షెహబాజ్ షరీఫ్. ఇప్పటికే ఆయన ఒకసారి ప్రధాని బాధ్యలు నిర్వర్తించారు.. మరోసారి పాక్ ప్రదాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 60 ఏళ్ల వయసులో ఆయన ఐదో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన జీవితంలో పెళ్లిళ్ల విషయం గురించి తెలుసుకుందాం. పాక్ ప్రధాని షెహబాజ్ వయసు 72 ఏళ్లు . ఈయన ఇప్పటి వరకు ఐదుగురిని వివాహం చేసుకున్నారు. అందులో ముగ్గురు భార్యలతో ఇప్పటికే విడాకులు జరగ్గా.. మిగిలిన ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది. 1973 లో 23 ఏళ్ల వయసులోనే ఆయన తన కుటుంబం అనుమతి లేకుండా సుస్రత్ షెహబాజ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు, ఆ తర్వాత 1993 లో 43 ఏళ్ల యవసులో మోడల్ అలియా హనీనీ పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో అలియా హనీ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తర్వాత నిలోఫర్ ఖోసాను పెళ్లి చేసుకున్నాడు. ఆ బంధం కూడా ఎక్కవ నిలవలేదు.

కొంత కాలం తర్వాత ఒంటరిగా ఉన్న షెహబాజ్ షరీ.. 2003 లో పాకిస్థాని రచయిత్రి, నటి అయిన తెహ్మిని దురానీనీ పెళ్లి చేసుకున్నారు. ఏనిమిదేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. చివరిగా 2012 లో షెహబాజ్ తన 60 వ ఏట ఐదో పెళ్లి చేసుకున్నారు. కుల్సూమ్ హాయి అనే మహిళలను రహస్యంగా వివాహం చేసుకోగా.. కొన్ని రోజుల తర్వాత వారు విడాకులు తీసుకున్నట్లు సమాచారం. వ్యాపారంలోనూ షెహబాజ్ షరీఫ్ తనదైన మార్క్ చాటుకున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ ర.13.20 కోట్లు అని తెలుస్తుంది. లండన్ లో ఆయనకు ఉనన్న మొత్తం ఆస్తుల విలువ రూ.15.3 కోట్లు కాగా.. పాక్ లో రూ.10.8 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.26.3 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన ఐదవ వివాహం చేసుకున్న విషయంపై పాక్ లో ఎన్నో కథనాలు వస్తున్నాయి.