iDreamPost
android-app
ios-app

Diabetes Oral Insulin: మధుమేహం బాధితులకు భారీ ఉపశమనం..ఇక నుంచి చుక్కల మందు!

నేటికాలంలో షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు..నయం కావడం దాదాపు అసాధ్యమైని పలువురు చెబుతుంటారు. అయితే తాజాగా ఈ వ్యాధికి చుక్కల మందును అందుబాటులోకి తీసుకురానున్నారు.

నేటికాలంలో షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు..నయం కావడం దాదాపు అసాధ్యమైని పలువురు చెబుతుంటారు. అయితే తాజాగా ఈ వ్యాధికి చుక్కల మందును అందుబాటులోకి తీసుకురానున్నారు.

Diabetes Oral Insulin: మధుమేహం బాధితులకు  భారీ ఉపశమనం..ఇక నుంచి చుక్కల మందు!

నేటికాలంలో చాలా మందిక డయోబెటీస్ తో బాధపడుతున్నారు. ఇది జీవిత కాలం వేధించే తీవ్రమైన జబ్బుగా పలువురు చెబుతుంటారు. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అంతేకాక చాలా మంది ఈ వ్యాధి చికిత్సకు భారీగా ఖర్చు అవుతుంది. దీంతో ఎంతో మంది ఆర్థికంగా చితికపోతున్నారు. అంతేకాక ఏటా అనేక మంది ఈ వ్యాధి కారణం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక చికిత్సలో భాగంగా తరచూ ఇంజెక్షన్లు వేయించుకోవాలి. దీంతో అది వారికి నరకంగా ఉంటుంది. వాటి ప్లేస్ లో చుక్కల మందుకు వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

షుగర్ వ్యాధినే మధుమేహం, డయాబెటీస్ అనే పేర్లతో పిలుస్తుంటారు. నేటికాలంలో షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు..నయం కావడం దాదాపు అసాధ్యమైని పలువురు చెబుతుంటారు. అలానే ఈ షుగర్ వ్యాధికి గురైన వారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలానే ఈ వ్యాధి అనేది శరీరంలోనే వివిధ అవయవాలపై  చెడు ప్రభావం చూపిస్తుంది. చివరికి గుండె, కిడ్నీతోపాటు కంటి సమస్యలు ఏర్పడుతాయి. ఇక ఈ వ్యాధి సోకిన వారు షుగర్ లెవెల్స్ ను  అదుపులో ఉంచుకునేందుకు నిత్యం ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అలానే చక్కెర స్థాయి బాగా పెరిపోయిన వారు ఏకంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటారు.

 ఇలా తరచూ ఇంజెక్షన్లు తీసుకునే సమయంలో ఎంతో నరకం అనుభవిస్తుంటారు. ఇక ఇలాంటి బాధ నుంచి ఉపశయనం కల్పించే వార్త ఒకటి వచ్చింది.  ప్రస్తుతం షుగర్ వ్యాధికి కొత్త చికిత్సను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకువచ్చారు. చుక్కల మందును యూకే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. డయాబెటీస్ కి గురైతే ఇన్సులిన్ ఇంజక్షన్లు చేసినప్పుడు వచ్చే బాధ నుంచి విముక్తి పొందేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయంను కనిపెట్టారు.

ఇన్సులిన్ ఇంజెక్షన్ల సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు చుక్కల మందును అభివృద్ధి చేశారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ బదులు ఈ చుక్కలను నాలుక కింద వేసుకొంటే సరిపోతుంది. బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా శాస్త్రవేత్తలు ఈ చుక్కల ఇన్సులిన్ మందును తయారు చేశారు. షుగర్ వ్యాధి ఉన్న వారు…ఈ చుక్కలను నాలుక కింద వేసుకొంటే చాలు.. అవి రక్తంలో కలిసి గ్లూకోజ్‌ స్థాయిని అందుపులో ఉంచుతాయి. నిజానికి ఇన్సులిన్‌ అణువులు పెద్దగా ఉండటం వల్ల రక్తంలో సరిగ్గా ప్రవహించలేవు. అందుకే శాస్త్రవేత్తలు చేప ఉప ఉత్పత్తుల నుంచి సెల్‌ పెనెట్రేటింగ్‌ పెప్టయిడ్‌ అనే ఇన్సులిన్‌ తయారు చేశారు.

దీనిని బ్లడ్ కి అనుసంధానిస్తారు. దీంతో ఇన్సులిన్ అతి చిన్న అణువులుగా మారి.. సులువుగా రక్తలో ప్రవహించగలిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. తొలుత ఎలుకలపై పరిశోధనలు నిర్వహించారు. వాటిల్లో విజయవంతం అయ్యిందని పరిశోధకులు తెలిపారు. ఎలుకల రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులోకి వచ్చాయని వారు వెల్లడించారు. ఇక ఈ చుక్కల మందు  పేటెంట్‌ కోసం ప్రయత్నాలు వేగవంతం చేశామని తెలిపారు. అంతేకాక  అతి త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేస్తామని, ఆదిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొత్తంగా ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపశమనం లాంటిదే అని చెప్పొచ్చు.