ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పని వేళల్లో నిద్రపోవచ్చట.. ఎక్కడంటే!

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పని వేళల్లో నిద్రపోవచ్చట.. ఎక్కడంటే!

Office Time Sleeping Permission: ఆఫీస్ వేళలో ఉద్యోగులకు నిద్ర రావడం సహజం. అయితే వర్క్ ఆగిపోతుందనే భయం, బాస్ ఏమైనా అంటాడేమో అని భయంతో నిద్రను ఆపుకుని మరీ పని చేస్తుంటారు. ఇలా నిద్రపోయే వారికి ఓ దేశం గుడ్ న్యూస్ చెప్పింది.

Office Time Sleeping Permission: ఆఫీస్ వేళలో ఉద్యోగులకు నిద్ర రావడం సహజం. అయితే వర్క్ ఆగిపోతుందనే భయం, బాస్ ఏమైనా అంటాడేమో అని భయంతో నిద్రను ఆపుకుని మరీ పని చేస్తుంటారు. ఇలా నిద్రపోయే వారికి ఓ దేశం గుడ్ న్యూస్ చెప్పింది.

చాలా మందికి ఆఫీస్ లో ఉండగా నిద్ర వస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి.. అనుకున్న పని పూర్తి కాకున్నా కూడా అలసటతో ఓ పక్క నిద్ర ముంచుకొస్తుంటుంది. అయినప్పటికీ పనికోసం వస్తున్ననిద్రను కూడా ఆపుకుంటారు. ఇంకా ఆఫీస్ లో నిద్రపోతే ఎవరైనా తిడతారని భయపడుతుంటారు. అయితే ఓ దేశంలో  మాత్రం పని వేళల్లో నిద్రపోవచ్చు. ఇంత బంఫర్ ఆఫర్ ఇచ్చిన దేశం ఏమిటి, అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు  తెలుసుకుందాం…

జపాన్ దేశంలో ఇలాంటి ఆఫర్ ను ఉద్యోగులకు అందిస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ సమయం పనిచేసే ఉద్యోగులు ఉన్న దేశం జపాన. అందుకే తమపై అణుబాంబు పడిన తరువాత కూడా చాలా వేగంగా నిలదొక్కుకొని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడింది. కారణంగా ఇక్కడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. ఎక్కువ పనిచేసి, ఆఫీసులోనే ఎక్కువ సమయం సంస్థ కోసం గడిపిన వారికి వర్క్ టైమ్ మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకునే  అవకాశం ఇస్తున్నారు. సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షే మం కోసం ఈ విధానాన్ని అక్కడ దేశంలో అమలు చేస్తున్నారు.

గతంలో నిద్రలేమి కారణంగా ఇద్దరు వ్యక్తులము మరణించారు. ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాత జపాన్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగంలో పనిచేసే ఉద్యోగులకు పని గంటల కంటే ఎక్కువ టైమ్ చేయొద్దని ఆదేశాలిచ్చింది. అంతేకాక పని చేసే సమయంలో నిద్ర వస్తే పడుకోమని కూడా సూచించింది. అయితే.. జపాన్ పౌరులు మాత్రం నిద్రకు దూరమై పనిచేయాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. పనిచేస్తున్న సమయంలో మధ్యలో నిద్ర వస్తే హాయిగా కాసేపు నిద్రపోవచ్చని అక్కడి కంపెనీలు అనుమతి ఇస్తున్నాయి.

ఇక అంతేకాక జపాన్ దేశంలోని టోక్యో నగరంలో ఓ వెడ్డింగ్ ఆర్గనైజర్ కంపెనీ.. తమ కంపెనీలో పని చేసే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎవరైతే ఆరగంటలు హాయిగా నిద్రపోతారో వారికి రివార్డులు ఇస్తుంది. నిద్రను ఆపుకుని మరి పని చేయడం అంటే.. పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి పనిచేయించడమే అని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు  వస్తాయి. అందుకే.. జపాన్ ఉద్యోగులను పని సమయంలో నిద్రపోవడానికి వీలుగా తగు ఏర్పాట్లు చేస్తున్నది. నిద్రపోయిన సమయాన్ని అదనంగా పనిచేసి భర్తీ చేసుకోవాలి. నిద్రొచ్చినప్పుడు పడుకోవాలి.. మెలకువ వచ్చినప్పుడు పనిచేయాలన్నమాట. అలాగని ఎక్కువసేపు పడుకుంటే కూడా నైపుణ్య శక్తి తగ్గిపోయి సోమరితనం ఆవరిస్తుంది. అందుకే.. శరీరానికి సరిపడేంతగా నిద్రపొండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Show comments