Dharani
ఎలుకలు పట్టడం అంటే మన దగ్గర చాలా చీప్‌గా చూస్తారు. కానీ అక్కడ మాత్రం ఇదే ఎలుకలు పట్టే వారికి ఏడాదికి ఏకంగా కోటి రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు రెడీ అయ్యారు. ఇంతకు ఎక్కడ.. ఎందుకు.. అంటే..
ఎలుకలు పట్టడం అంటే మన దగ్గర చాలా చీప్‌గా చూస్తారు. కానీ అక్కడ మాత్రం ఇదే ఎలుకలు పట్టే వారికి ఏడాదికి ఏకంగా కోటి రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు రెడీ అయ్యారు. ఇంతకు ఎక్కడ.. ఎందుకు.. అంటే..
Dharani
ఈమధ్య కాలంలో కొన్ని వింత వింత ఉద్యోగాల గురించి వింటున్నాం. ఫుడ్ టేస్ట్ చేయడం, జంతువులకు కేర్ టేకర్‌గా ఉండటం, పర్యాటక ప్రదేశాలు చూసి రివ్యూలు ఇవ్వడం వంటి జాబ్‌ల గురించి వింటున్నాం. భారీ వేతనాలు, కళ్లు చెదిరే ఆఫర్లతో ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక తాజాగా మరో వింత జాబ్ తెర మీదకు వచ్చింది. అది ఏంటంటే ఎలుకలు పట్టడం. అవును మీరు విన్నది నిజమే. ఎలుకలు పట్టే ఉద్యోగమే. పైగా ఈ ఉద్యోగానికి ఏకంగా ఏడాదికి కోటి రూపాయలకు పైగా జీతం చెల్లించేందుకు ముందుకు రావడం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. మరి ఇంతకు ఈ జాబ్ ఎక్కడ.. అంటే..
మన దేశంలో ఎలుకలు అనేవి చాలా కామన్. ఇంట్లో బొరియలు చేసుకుని.. ధాన్యం బస్తాలకు కన్నాలు పెట్టి భారీ నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఇక బీరువాలో దూరి బట్టలకు చిల్లులు పెడుతుంటాయి. చరిత్రలో ఎలుకల వల్ల కరువు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటే.. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక మన దగ్గర ఎలుకల బెడద నుంచి తప్పించుకోవడానికి బోను పెట్టడం, విషం పెట్టడం, వంటివి చేస్తాము. ఇక ఈ మధ్య కాలంలో ర్యాట్ మ్యాట్ అనే పరికరాలు కూడా వస్తున్నాయి.
ఎలుకల బెడద అనేది మన దగ్గర అయితే ఇది చాలా కామన్, చిన్న సమస్య. కానీ విదేశాల్లో మాత్రం.. ఇది దేశాన్ని వణికించే సమస్యగా మారింది. దీన్ని పరిష్కరించడం కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా జీతం ఇచ్చి.. ఉద్యోగిని నియమించుకుంటున్నారంటే.. అక్కడ ఈ సమస్య ఎంత పెద్దదో.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరి ఈ ఎలుకలు పట్టే ఉద్యోగం ఎక్కడ అంటే.. అమెరికా, న్యూయార్క్ నగరం. అక్కడ ఎలుకల బెడద తీవ్రంగా ఉంది. సబ్‌వేలు, డ్రైనేజీలు, పార్కులు ఎక్కడ చూసినా ఎలుకల గుంపులే కనిపిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. సమస్యను పరిష్కరించడం కోసం.. న్యూయార్క్ అధికారులు ఓ ర్యాట్ క్యాచర్‌ను నియమించుకునేందుకు రెడీ అయ్యారు. ఎలుకలు పట్టే వ్యక్తికి జీతం కింద ఏడాదికి రూ. 1.2 కోట్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు.
ఈమేరకు పత్రికా ప్రకటన ఇచ్చి.. అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందుకోసం నోటిషికేషన్ విడుదల చేయగా.. ఏకంగా వెయ్యి మంది ఈ జాబ్ కోసం అప్లై చేసుకున్నారు. ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇలా వచ్చిన అప్లికేషన్లలో కేథలిన్ కొరాడీ అనే మాజీ ఉపాధ్యాయురాల్ని ఎలుకలు పట్టే ఉద్యోగానికి ఎంపిక చేశారు.
స్కూల్ టీచర్‌గా పనిచేసిన కేథలిన్ కొరాడీ .. ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై పరిశోధన చేశారు. దీంతో ఎలుకల సంఖ్యను తగ్గించే బాధ్యతలను ఆమె భుజాన వేశారు. ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకు దొరక్కుండా డిస్పోజ్ చేయడం, వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం, సబ్‌వేలలో ఎలుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోకుండా చూడటం ఆమె విధి. కానీ, విష పదార్థాలను పెట్టి ఎలుకలను చంపకూడదనే షరతు విధించారు అధికారులు. ఎందుకంటే గతంలో ఆలా చేయడం వల్ల చనిపోయిన ఆ ఎలుకలను తిని ఇతర జంతువులు, పక్షులు మృత్యువాతపడ్డాయి. అందుకే విషం పెట్టొద్దనే నిబంధన పెట్టారు.
కొరడీ మీడియాతో మాట్లాడుతూ.. నార్త్ కరోలినాలో ఉండే తన నాయినమ్మ ఫోన్ చేసి చెప్పడంతో ఈ ఉద్యోగం గురించి తెలిసిందని అన్నారు. ఎలుకలు సమస్యలు ఒకరికే పరిమితం కాదు.. ఇది మనందరినీ ఇబ్బంది పెడుతుందని తెలిపారు. నగరంలో ఎలుకల నివారణకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.