పొరుగు దేశం నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రతకు మన దేశంలోని పలు ప్రాంతాలూ కంపించాయి. ఢిల్లీలోనైతే ప్రజలు ఏం జరుగుతుందో తెలియక రోడ్ల మీదకు పరుగులు తీశారు.
పొరుగు దేశం నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రతకు మన దేశంలోని పలు ప్రాంతాలూ కంపించాయి. ఢిల్లీలోనైతే ప్రజలు ఏం జరుగుతుందో తెలియక రోడ్ల మీదకు పరుగులు తీశారు.
పొరుగు దేశం నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడ భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 70 మంది మృతి చెందారని తెలుస్తోంది. అంతేగాక పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ భూకంపానికి సంబంధించి అక్కడి స్థానిక అధికారులు వివరాలు వెల్లడించారు. దేశంలోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని నేపాల్ అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో భూకంపం రావడంతో పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ తెగిపోయింది. దీంతో అసలు ప్రమాద తీవ్రత ఎంతనేది సరిగ్గా చెప్పలేని పరిస్థితి.
నేపాల్‌లో శుక్రవారం రాత్రి 11 గంటల టైమ్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అక్కడ భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. అయితే ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కూడా కంపించడం గమనార్హం. నేపాల్‌కు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూఢిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. భయానికి గురైన ఢిల్లీ ప్రజలు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. భూకంపంపై పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
ఇక, నేపాల్ రాజధాని ఖాట్మండుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబర్కోట్లో భూకంప కేంద్రాన్ని గుర్తించామని ఆ దేశ నేషనల్ అర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఎన్ఈఎంఆర్సీ) తెలిపింది. భూకంప తీవ్రత వల్ల నేపాల్‌లోని పలు జిల్లాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకల్ అనే జిల్లాలో అయితే ఇళ్లు కూలి సుమారు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. జబర్కోట్లో కూడా 34 మంది మృతి చెందారని స్థానిక అధికారులు వెల్లడించారు. భూకంపం అర్ధరాత్రి సంభవించడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయని, కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి వెళ్లలేకపోయామని అధికారులు పేర్కొన్నారు. మరి.. నేపాల్ విషాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అమిత్ షాతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. కారణం..?
Nepal: Death toll jumps to 70 after strong earthquake
Read @ANI Story | https://t.co/e1TCzfvGr9#NepalEarthquake #earthquake #Nepal pic.twitter.com/xY8BEM2zMS
— ANI Digital (@ani_digital) November 4, 2023