iDreamPost

కూలిన నేవీ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది మృతి!

కూలిన నేవీ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది మృతి!

ఈ మద్య నేలపైనే కాదు ఆకాశంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానాలు, హెలికాఫ్టర్లు సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ప్రకృతి అనుకూలించకపోవడం, పక్షులు ఢీ కొట్టడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం ప్రాణాలతో బయట పడుతున్నారు.. కొన్నిసార్లు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నేవీ హెలికాప్టర్ కుప్పకూలిపోయిన ఘటనలో ముగ్గురు సిబ్బంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల కాలంలో వరుస విమాన, హెలికాప్టర్ ప్రాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విమానశాఖ అధికారులు అంటున్నారు. తాజాగా పాకిస్థాన్ కి చెందిన నేవీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నేవీ సిబ్బంది చనిపోయారు. పాక్ లో కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతున్న తిరుగుబాటు ప్రాంతమైన బలుచిస్థాన్ ప్రావెన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్వాదర్ లో టేకాఫ్ అయిన నేవీ శిక్షణ హెలికాప్టర్ సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో కూలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు నేవీ అధికారులు, మరో సిబ్బంది చనిపోయినట్లు పాకిస్థాన్ నేవీ ప్రతినిధి తెలిపారు.

ఈ విషాద ఘటన గురించి తెలియగానే మృతుల కుటుంబాల్లో విషాదాలు నిండుకున్నాయి. సాంకేతిక సమస్యల వల్లనే హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని అన్నారు. అయితే నేవీ హెలికాప్టర్ కూలిపోవడానికి ముందు ఇంజన్ లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటవాదులు నేవీ హెలికాప్టర్ ని కూల్చివేసి ఉంటారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ లో ఖోస్ట్ ప్రాంతంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది.. ఇందులో ప్రయాణిస్తున్న 6 గురు ఆర్మీ సిబ్బంది కన్నుమూసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి