సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన.. NASA స్పందన!

Sunitha Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియన్స్ సునీతా విలియన్స్ కి చెందిన ఓ ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది.

Sunitha Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియన్స్ సునీతా విలియన్స్ కి చెందిన ఓ ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది.

సునీతా విలియమ్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఈమె యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, NASA వ్యోమగామి. ప్రస్తుతం సునితా విలియమ్స్ తో పాటు నాసా వ్యోమగామి బారీ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. 2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్‌లో భాగంగా ఈ రోదసీ యాత్రను వారు చేపట్టారు. వీరు జూన్ 14వ తేదీన భూమికి తిరుగుపయనం కావాల్సి ఉంది. కానీ అనుకోకుండా స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వీరు అంతరిక్షంలోనే చిక్కుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత రెండు రోజులుగా నాసా ఆస్ట్రోనాట్‌ సునితా విలియమ్స్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి పోయిందని, ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఆమె బరువు తగ్గి చిక్కిపోయి, నీరసంగా కనిపించి ఓ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఈ విషయంపై అమెరికాకు చెందిన డాక్టర్ వినయ్ గుప్త ఆమె ఆరోగ్యంపై భయాందోళన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. అయితే సునితా విలియమ్స్ చాలా కాలం పాటు అంతరిక్షంలోనే ఉన్న కారణంగా ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సునితా ఆరోగ్యం క్షీణిస్తుందన్న వార్తలపై నాసా స్పందించింది.సునితా విలియమ్స్ తో సహా వ్యోమగాములందరూ క్షేమంగా ఉన్నారని నాసా తెలిపింది. ఆస్ట్రోనాట్‌ కి ఎప్పటికప్పుడు పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వెల్లడించింది. దాదానె నాలుగు నెలల నుంచి వీరు అంతరిక్షంలోనే ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వాళ్లను భూమి మీదకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

సునితా విలియమ్స్ 2006, 2007 లో రెండు అంతరిక్ష ప్రయాణాలు చేశారు. అంతరిక్ష మొదటి ప్రయాణం లో ఆరు నెలలు సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మత్తులు చేయడం వంటివి చేసింది. రెండవ సారి ఆర్బిటింగ్ ప్రయోగశాల పై పరిశోధనలు జరిపింది. ఆమె ఖగోళ శాస్త్రంలో గొప్ప రికార్డులను సృష్టించారు. దాదాపు 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె వ్యక్తిత్వం, మనోధైర్యం, ఖగోళ శాస్త్రంపై చేసిన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రేరణ పొందిన వ్యక్తిగా గుర్తించబడింది.

ఇటీవల సునితా విలియమ్స్ మాట్లాడుతూ.. అమెరికాలో జరిగిన ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు. ఐఎస్ఎస్ లో ఉంటూ నా కుటుంబాన్ని, రెండు కక్కలను ఎంతో మిస్ అవుతున్నా.. ఈ బాధ నా కుటుంబ సభ్యులు కూడా పడుతున్నారని తెలిపింది. నేను ఇక్కడ బాగానే ఉన్నాను’ అని తెలిపింది. ఈ విషయాన్ని నాసా కూడా ధృవీకరించింది. సునితా విలియమస్ ఐఎస్ఎస్ కమాండర్. సెప్టెంబర్ 22న జరిగిన కార్యక్రమంలో ఆమె ISS కమాండర్ గా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఉన్న ఇతర సిబ్బందితో పాటు సునితకు రోజువారి బాధ్యతలు అప్పగించబడ్డాయి. సాధారణ పనితో పాటు అంతరిక్ష నడకలు, పలు శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. NASA త్వరలోనే వ్యోమగాములను తిరిగి తీసుకువస్తామని, వారి భద్రతకు ప్రాదాన్యత ఇస్తామని తెలిపింది. వారి ఆరోగ్యం పట్ల ఎవరూ అందోళన వ్యక్తం చేయవొద్దని, లేని పోని రూమర్లు సృష్టించవొద్దని కోరింది.

Show comments