iDreamPost
android-app
ios-app

ఏమి ఐడియా రా..బాబు!ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చా?

డబ్బును సంపాదించేందుకు మనిషికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని సక్రమ మార్గాలు ఉంటే.. మరికొన్ని అక్రమ మార్గాలు ఉన్నాయి. ఇవన్ని పక్కన పెడితే.. కొన్ని రకాల సంపాదనలు చూస్తే.. వాట్ ఏ ఐడియా, వాట్ ఏ విజన్ అని అనక ఉండలేము.

డబ్బును సంపాదించేందుకు మనిషికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని సక్రమ మార్గాలు ఉంటే.. మరికొన్ని అక్రమ మార్గాలు ఉన్నాయి. ఇవన్ని పక్కన పెడితే.. కొన్ని రకాల సంపాదనలు చూస్తే.. వాట్ ఏ ఐడియా, వాట్ ఏ విజన్ అని అనక ఉండలేము.

ఏమి ఐడియా రా..బాబు!ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చా?

ప్రతి మనిషి బతుకు బండి నడవాలి అంటే.. డబ్బు అనే ఇంధనం ఉండాలి. అది ఎంత ఉంటే.. అంతా హాయిగా బతుకు బండి నడుస్తుంది. అందుకే ధనం కోసం మనిషి వివిధ అనేక రకాల పనులు చేస్తుంటారు. కొందరు ఉద్యోగాలు చేయగా, మరికొందరు వ్యాపారాలు చేస్తుంటారు. ఇలా డబ్బులను సంపాదించే విధానం మనకు తెలుసు. అయితే కొందరు మాత్రం చాలా విచిత్రంగా డబ్బులను సంపాదిస్తుంటారు. వారి ఐడియాను చూస్తే.. ఇలా కూడా ధనం సంపాదించ వచ్చా అనే సందేహం కలగక మానదు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూసినట్లు అయితే..మీకు విషయం అర్థమవుతుంది.

మనిషికి వచ్చే ఆలోచన బట్టి అతడి స్థితి మారుతుంది. కొందరు వ్యాపారం, ఉద్యోగం వంటివి చేయలేక డబ్బులు ఎలా సంపాదించాలని మానసికంగా కుంగిపోతుంటారు. తమకు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయని తమలో తామే తీవ్రంగా వేదన చెందుతుంటారు. మరికొందరు మాత్రం పరిసరాల్లోని పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని..ధనం సంపాదించే మార్గాలుగా చేసుకుంటున్నారు. కొందరు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు, బస్టాండ్ లో దిగే వారి లగేజీ మోయడం వంటి వివిధ రకాల పనులు చేస్తూ డబ్బులు సంపాందిస్తుంటారు. ఇలా అనేక రకాల ధనార్జన మార్గాలతో పాటు కొన్ని విచిత్రమైన మార్గాలు మనకు కనిపిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసినట్లు అయితే.. ఈ విషయం మీకు అర్థమవుతుంది.

వైరల్ అవుతున్న వీడియో బంగ్లాదేశ్ లో జరిగింది. ఆ దేశంలోని ఢాకా- చిట్టగాంగ్ జాతీయ రహదారిలోని ఓ ప్రాంతంలో జరిగింది. వీడియోను చూసినట్లు అయితే.. అక్కడ కొందరు బస్సులో దిగే వారిని డివైడర్ ను దాటిస్తున్నారు. అయితే వాళ్లు ఏదో సహయం చేస్తున్నారు అనుకుంటే పొరపాటే. ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకుని మరీ రోడ్డు దాటిస్తున్నారు. ఢాకా-చిట్టగాంగ్ జాతీయ రహదారిపై చాలా దూరం ఎత్తుగా డివైడర్ ఉంది. ప్రయాణికులు డివైడర్ అవతలి ప్రాంతానికి వెళ్లాలంటే..మాత్రం చాలా దూరం నడవాల్సి ఉంటుంది. అది వారికి చాలా పెద్ద సమస్యగా ఉండేది. ఆ జాతీయ రహదారిపై నిత్యం పదుల సంఖ్య బస్సులు తిరుగుతుంటాయి.

ఇక ప్రయాణికుల బలహీనతను కొందరు ఆసరాగ చేసుకుని డబ్బులు సంపాదన మార్గంగా ఎంచుకున్నారు. డివైడర్ కి ఇరువైపు చిన్నపాటి నిచ్చేన వేసి.. బస్సులో దిగే ప్రయాణికులను డివైడర్ దాటిస్తున్నారు. అందుకు గాను వారి నుంచి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేసే వారు. ఇక ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఈ దందాను నిర్వహిస్తున్నా ఎంజీ రబీల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అలానే  వారి వద్ద నుంచి ఆ నిచ్చెను కూడా స్వాధీనం చేసుకున్నారు. డివైడర్ సమస్యను పరిష్కరిస్తామని స్థానిక అధికారులు తెలిపినట్లు సమాచారం. మొత్తంగా సోషల్ మీడియాలో ఈ  వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Knowledge | News | Career | Current Affairs | (@crazziee_stuff)