iDreamPost
android-app
ios-app

ఎన్నికల రేసు నుంచి వైదొలిగిన జో బైడెన్! కమలా హారిస్ కి మద్దతు!

Joe Biden Drops From Presidential Race- Supports Kamala: అమెరికా ఎన్నికల పర్వంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన నామినేషన్ ను స్వీకరించడం లేదు అంటూ ప్రకటించారు. తాను ఈ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

Joe Biden Drops From Presidential Race- Supports Kamala: అమెరికా ఎన్నికల పర్వంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన నామినేషన్ ను స్వీకరించడం లేదు అంటూ ప్రకటించారు. తాను ఈ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల రేసు నుంచి వైదొలిగిన జో బైడెన్! కమలా హారిస్ కి మద్దతు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి తాను రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. అమెరికా ప్రజలకు ఆయన లేఖ రాశారు. తాను నామినేషన్ ను స్వీకరించడం లేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇంక తన పదవీకాలానికి సంబంధించి.. ఆ టర్మ్ ని పూర్తి చేయడంపై తాను దృష్టి పెడుతున్న విషయాన్ని ప్రకటించారు. అయితే తన తర్వాత ఆ రేసులో ఎవరు ఉండాలి అనే విషయానికి సంబంధించి ఆయన తన అభిప్రాయాన్ని ప్రకటించారు. తన నామినీగా కమలా హారిస్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే ఆమెకు తన మద్దతు కూడా ప్రకటించారు.

సొంత పార్టీలోనే అసంతృప్తి:

జో బైడెన్ ఆరోగ్యానికి సంబంధించి గత కొన్నాళ్లుగా పలు అనుమానాలు, పుకార్లు బాగా వైరల్ అవ్వడం చూశాం. వయసు పైబడటం వల్ల కూడా ఆయన శరీరం సహకరించడం లేదు అంటూ వార్తలు వచ్చాయి. అందుకు ఆయన ప్రవర్తన కూడా బలం చేకూర్చింది. అందుకే సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి, వ్యతిరేకత ఎదురైంది. ఆయన రేసు నుంచి తప్పుకోవాలి అంటూ డెమోక్రాట్ల నుంచి డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే వీటికి సంబంధించి ఎప్పుడూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తాజాగా జో బైడెన్ తాను నామినేషన్ ను స్వీకరిచడం లేదు అంటూ స్వయంగా ప్రకటించారు. అందుకు సంబంధించి లేఖ కూడా రాశారు. అయితే ఎన్నికలకు కేవలం 4 నెలలో ఉన్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి అభ్యర్థి ఎవరు అనే అయోమయం నెలకొంది. అయితే ఆయన కమలా హారిస్ కు తన మద్దతు తెలుపుతున్నట్లు ఎక్స్.కామ్ వేదికగా పోస్ట్ చేశారు.

కమలానే సరైన ఎంపిక:

కమలా హారిస్ గురించి ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. “నేను 2020లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. నేను కమలా హారిస్ ను నా వైస్ ప్రెసిడెంట్ గా ఎంచుకున్నాను. అది నేను తీసుకున్న గొప్ప నిర్ణయంగా భావిస్తాను. ఇప్పుడు నేను నామినీగా కమలా హారిస్ ను బల పరుస్తున్నాను. అందరూ ఆమెకు సమపోర్ట్ చేయడమే కాకుండా.. మన పార్టీ తరఫున ఆమెను నామినీగా ఎన్నుకోవాలని కోరుతున్నాను. డెమోక్రాట్స్.. అందరూ ఏకమయ్యి.. ట్రంప్ ను ఓడించాల్సిన సమయం వచ్చింది” అంటూ జో బైడెన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. జో బైడెన్ తనకు మద్దతు తెలపడంపై కమలా హారిస్ స్పందించారు. జో బైడెన్ కు ధన్యవాదాలు తెలిపారు.

“అధ్యక్షుడి ఆమోదం పొదడం నేను గౌరవంగా భావిస్తున్నాను. నా నామినేషన్ ను పొంది.. ట్రంప్ పై విజయం సాధించడమే నా ఉద్దేశం” అంటూ కమలా హారిస్ వ్యాఖ్యానించారు. అయితే కేవలం బైడెన్ మద్దతు తెలిపినంత మాత్రాన కమలా హారిస్ ను అభ్యర్థిగా భావించడానికి లేదు. బైడెన్ మద్దతు ఉండటం కలిసొచ్చే అంశం. వచ్చే నెలలో చికాగోలో జరిగే డెమోక్రాట్ల జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధుల నుంచి కమలా హారిస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎన్నికలకు ఇంకా కేవలం 4 నెలలు మాత్రమే ఉండటం.. ట్రంప్ కాస్త దూకుడుగా ఉన్న నేపథ్యంలో డెమోక్రాట్లు ఈ నిర్ణయాన్ని కాస్త త్వరగానే తీసుకోవాల్సి ఉంటుంది. మరి.. జో బైడెన్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.