పల్లెకు పోయి పెళ్లి చేసుకుంటే రూ.6 లక్షలు! జపాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్!

Japan News: యువతులకు, ఒంటరి మహిళళకు ఓ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పల్లెటూర్లకు వెళ్లి.. అక్కడి యువకులను పెళ్లి చేసుకుంటే.. భారీగా ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

Japan News: యువతులకు, ఒంటరి మహిళళకు ఓ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పల్లెటూర్లకు వెళ్లి.. అక్కడి యువకులను పెళ్లి చేసుకుంటే.. భారీగా ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన వేడుక. అందుకే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని యువత భావిస్తోంది. ఇదే సమయంలో పెళ్లిళ్ల విషయంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. కొన్ని దేశాల్లో పెళ్లిళ్లు, పిల్లల విషయంలో బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజాగా యువతులకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. పల్లెలకు వెళ్లి వివాహం చేసుకుంటే లక్షల డబ్బులు పొందవచ్చు. ఈ బంపర్ ఆఫర్ ను జాపన్ ప్రభుత్వం ప్రకటించింది. మరి..పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

జపాన్ ప్రభుత్వం పెండ్లి కాని యువతులు, ఒంటరిగా ఉండే మహిళలకు సూపర్ న్యూస్ అందించింది.  ఆ దేశ రాజధాని టోక్యో నుంచి పల్లెలకు వెళ్లి వివాహం చేసుకోవాలని తెలిపింది. అలా పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయితే ఆర్థిక సాయం, ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపింది. జపాన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా తెలిపింది. చదువు, జాబ్ ల కోసం యువతులను పెద్ద ఎత్తున టోక్యోకు వచ్చి అక్కడే స్థిరపడి పోతున్నారు. దీంతో పల్లెల్లో స్త్రీ,పురుషుల సంఖ్య గణనీయంగా పడిపోతోందట. దీంతో అక్కడి యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టంగా మారిపోయిందట. అందుకే గ్రామాల్లో యువతీ యువకుల సంఖ్యను సమయం చేయడం కోసం అక్కడి జపాన్ ప్రభుత్వం  ఇలా ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఒక అదిరిపోయే స్కీమ్ ను ప్రకటించింది.

2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు  జపా ప్రభుత్వం సిద్ధమైందని ‘ది జపాన్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా….టోక్యోలో ఉంటున్న వివాహం కానీ యువతులు, మహిళలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పెళ్లి సంబంధాలు చూసుకుంటే.. అందుకు అయ్యే మొత్తం ఖర్చులను అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకక టోక్యోలోని యువతులు పల్లెలకు వెళ్లి అక్కడి యువకులను వివాహం చేసుకుని, అక్కడే స్థిరపడిపోతే..దాదాపు 7 వేల డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 6 లక్షల రూపాయాల ఆర్థిక సాయం చేయనుంది.

2020 జనాభా లెక్కల ప్రకారం.. ప్రతి 100 మంది ఒంటరి పురుషులకు 80 మంది మాత్రమే ఒంటరి మహిళలు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ గ్యాప్ 30 శాతం వరకూ చేరింది. ఇదే సమయంలో జపాన్‎లో జననాల నమోదు రికార్డ్ స్థాయిలో పడిపోతోంది. జనాభా స్థిరంగా ఉండాలంటే జననాల రేటు కనీసం 2.1గా ఉండాలి. కానీ గతేడది ఏకంగా 1.20కి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రోత్సహించడంతోపాటు జననాల రేటును పెంచేందుకు జపాన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మరి..జపాన్ తీసుకొచ్చిన ఈ కొత్త స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments