P Krishna
JD Vance: అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సోషల్ మీడియాలో డోనాల్డ్ ట్రంప్ గురించి ఏదో ఒక కాంట్రవర్సీ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. రెండు రోజుల క్రితం ఆయనపై హత్యాయత్నం జరగడం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
JD Vance: అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సోషల్ మీడియాలో డోనాల్డ్ ట్రంప్ గురించి ఏదో ఒక కాంట్రవర్సీ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. రెండు రోజుల క్రితం ఆయనపై హత్యాయత్నం జరగడం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
P Krishna
అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది.. ఈ గటనలో ఆయన గాయపడ్డారు. శనివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువ షూటర్ అయనపై కాల్పులు జరిపిన ఘటనలో బుల్లెట్లు ఆయన కుడి చెవిని తాకుతూ వెళ్లాయి. దీంతో ట్రంప్ కిందపడిపోవడం.. బాడీగాడ్స్, సిబ్బంది అప్రమత్తమై సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, కాల్పులకు తెగబడిన యువకుడిని సీక్రెట్ సర్వీసెస్ బలగాలు అక్కడిక్కడే కాల్చి చంపారు. అయితే నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి ట్రంప్ పేరును ఆమోదించారు. ఇక ఉపాధ్యక్షుడిగా ఒహోయో సెనేటర్ గా జేడీ వాన్స్ పేరును ప్రకటించారు ట్రంప్. తాజాగా జేడీ వాన్స్ ఆంధ్రా అల్లుడు అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
నవంబర్ లో అమెరికా అధ్యక్ష పోటీ జరగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు నువ్వా నేనా అన్న చందంగా పోటీపడుతూ ప్రచారంలో మునిగిపోయారు. ఈ ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇదిలా ఉంటే మిల్వాకిలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధుఇలంతా అమెరికా అధ్యపదవి అభ్యర్థిత్వానికి డోనాల్డ్ ట్రంప్ కి ఆమోదం తెలిపారు. ఇక ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జెడి వేన్స్ (39) ని ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్ నెట్ వర్క్ ద్వారా ట్రంప్ ప్రకటించారు.
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వేన్స్ పేరు ప్రకటించగానే ఆయన ఎవరు అన్న విషయంపై సోషల్ మీడియాలో సర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే జేడీ వేన్స్ ఆంధ్రా అల్లుడు అంటూ వార్తలు వస్తున్నాయి. జేన్స్ వేన్స్ భార్య ఉష చిలుకూరి. ఏపీకి చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో శాన్‌డియాగోలో స్థిరపడ్డారు. 2014 లొ వేన్స్, ఉష ల వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. యేల్ లా స్కూల్ లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు.. ఆ సమయంలోనే ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తన ఎదుగుదలకు ఉష పాత్ర ఎంతో ఉందని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు జేడీ వేన్స్. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందించారు. సాంకేతిక, ఆర్థిక రంగాల్లో సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఆయన కొనసాగారు. 2022 లో మొదటిసారిగా అమెరికా సెనెట్ కి జేడీ వేన్స్ ఎన్నికయ్యారు.