iDreamPost
android-app
ios-app

వైద్య చరిత్రలో అద్భుతం.. మెడ నుండి వేరైన తలను అతికించిన వైద్యులు!

  • Author Soma Sekhar Published - 07:05 PM, Fri - 14 July 23
  • Author Soma Sekhar Published - 07:05 PM, Fri - 14 July 23
వైద్య చరిత్రలో అద్భుతం.. మెడ నుండి వేరైన తలను అతికించిన వైద్యులు!

అధునాత సాంకేతికతతో మనిషి సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూనే వస్తున్నాడు మానవుడు. ఈ సృష్టిలో సాధ్యం కావు అనుకున్న ఎన్నో సమస్యలకు తన మేథస్సుతో పరిష్కారం చూపాడు. ఇక వైద్య రంగంలో రోజురోజుకు వస్తున్న నూతన టెక్నాలజీతో ఎన్నో నయం కావు అనుకున్న జబ్బులను సైతం నయం చేస్తూ వస్తున్నారు డాక్టర్లు. తాజాగా వైద్య చరిత్రలోనే అద్భుతాన్ని సృష్టించారు ఈ డాక్టర్లు. కారు ప్రమాదంలో తెగిపడిన తలను మళ్లీ మెుండెంకు సక్సెస్ ఫుల్ గా అతికించారు. వైద్య చరిత్రలోనే ఇదో మైలు రాయి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ అద్భుతం ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి.

సాధారణంగా వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతం అనే మాటను మనం ఎక్కువగా సినిమాల్లో వింటుంటాం. అయితే ఈ మాట నిజ జీవితంలో చాలా అరుదుగా వింటూ ఉంటాం. ఇక వైద్య రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న విప్లవాత్మక మార్పులు, అభివృద్ధితో ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తున్నారు వైద్యులు. అయితే కొన్ని అసాధ్యం అనుకున్న ఆపరేషన్లను సైతం సుసాధ్యాలుగా మలుస్తున్నారు నేటి వైద్యులు. చాలా దేశాల్లో అరుదైన చికిత్సలు చేసి.. పేషంట్ల ప్రాణాలు కాపాడిన సంఘటనలు మనం ఎన్నో చూశాం. తాజాగా వైద్య చరిత్రలోనే అద్భుతమైన ఆపరేషన్ ను చేశారు ఇజ్రాయెల్ డాక్టర్లు. వివరాల్లోకి వెళితే..

ఇజ్రాయెల్ దేశానికి చెందిన 12 ఏళ్ల సులేమాన్ హాసన్.. ఓరోజు సైకిల్ తొక్కుతుండగా.. కారు వచ్చి ఢీకొట్టింది. దాంతో అతడి తల, మెుండెం దాదాపుగా వేరు అయ్యాయి. అతడి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అత్యవసరంగా ఆపరేషన్ చేయాలి అనడంతో.. అతడిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా హదస్సా మెడికల్ సెంటర్ కు తరలించారు. అతడి పరిస్థితిని చూసిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ ప్రారంభించాలని భావించారు. దీన్నీ మెడికల్ భాషలో బైలేటరల్ అట్లాంటో ఓక్సిపిటల్ జాయింట్ డిస్ లోకేషన్ అంటారని డాక్టర్లు తెలిపారు. కాగా.. తమకు ఉన్న అనుభవంతో.. తీవ్రంగా శ్రమించి అతడికి ఆపరేషన్ చేశారు.

కాగా.. ఈ ఆపరేషన్ లో బాలుడు బతికే అవకాశం 50 శాతం మాత్రమే ఉందని వెల్లడించారు వైద్యులు. అయినప్పటికీ వైద్యులు తీవ్రంగా శ్రమించి బాలుడికి విజయవంతంగా ఆపరేషన్ ను చేశారు. ఇక ఈ ప్రమాదం గతనెలలో జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సులేమాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడు పూర్తిగా కోలుకునే వరకు అతడి పరిస్థిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా.. తన కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు సులేమాన్ తండ్రి ఆస్పత్రి వర్గాలకు, వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపాడు. మరి ఇంతటి క్లిష్టమైన ఆపరేషన్ చేసిన ఇజ్రాయెల్ వైద్యులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఇదెక్కడి మోసం మావా.. రూ.150 ఇచ్చి- రూ.40 లక్షలు కొట్టేశారు!