iDreamPost

ఇదెక్కడి మోసం మావా.. రూ.150 ఇచ్చి- రూ.40 లక్షలు కొట్టేశారు!

ఇదెక్కడి మోసం మావా.. రూ.150 ఇచ్చి- రూ.40 లక్షలు కొట్టేశారు!

ఎప్పుడైనా ఈజీ మనీ కోసం కక్కుర్తి పడద్దు అంటూ పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ, కొంత మంది మాత్రం ఒళ్లు కదలకుండా డబ్బు వచ్చేస్తుంది అనగానే చంకలు గుద్దుకుంటూ వెళ్లిపోతారు. చేతులు కాలిన తర్వాత గానీ అసలు కథ అర్థం కాదు. అలా ఒక వ్యక్తి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. పదండి.. అసలు అతను ఎలా మోసపోయాడు? ఎవరు అతని వద్ద డబ్బులు కొట్టేశారు? అనే విషయాలు తెలుసుకుందాం.

ఈ ఘరానా మోసం అహ్మదాబాద్ లో జరిగింది. దేవ్ గన్ చౌహాన్ అనే వ్యక్తి 3డీ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాడు. అతనికి ఒకరోజు వాట్సాప్ లో తెలియని నంబర్ నుంచి పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ వచ్చింది. ఆ జాబ్ ఆఫర్ తీసుకోవడానికి దేవ్ గన్ చౌహాన్ సిద్ధపడ్డాడు. ఈ జాబ్ కోసం సైనప్ చేసుకోవడానికి రూ.1500 ఫీజ్ కట్టించుకున్నారు. చిన్న టాస్క్ లు పూర్తి చేసినందుకు అదనంగా రూ.400 కలిపి మొత్తం రూ.1900 రిటర్న్ చేశారు. ఆ మొత్తం తన ఖాతాలో పడగానే చౌహాన్ కు ఆ జాబ్ ఆఫర్ పై నమ్మకం కుదిరింది. తనకు వచ్చే ఆదాయానికి ఈ అదనపు మొత్తం యాడ్ అయితే బాగుంటుంది అని భావించాడు.

వాళ్లు ఇచ్చే టాస్కులు తీసుకోవడం ప్రారంభించాడు. తర్వాత అతని నుంచి రూ.2,050 కట్టించుకున్నారు. అప్పటి నుంచి పెద్ద టాస్కులు ఇవ్వడం మొదలు పెట్టారు. అంతేకాకుండా అతను కట్టిన రూ.2,050 తిరిగి ఇవ్వలేదు. అలా వీడియోలు లైక్ చేసే టాస్క్ అయిపోయిన తర్వాత అతనికి కొందరి నుంచి ఫోన్లు రావడం మొదలైంది. జాన్వీ సింగ్, మోనా, రొసనా అంటూ పలు పేర్లతో ఫోన్లు చేయడం ప్రారంభించారు. తర్వాత బాధితుడి చేత వెబ్ సైట్ తయారు చేయించారు. అతనికి ఇచ్చిన టాస్కులు చేయడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా వారి వెబ్ సైట్ లో తన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేశాడు.

తర్వాత అతడిని ఒక టెలిగ్రామ్ గ్రూపునకు యాడ్ చేశారు. పలు టాస్కులు పూర్తి చేసేందుకు చౌహాన్ దాదాపు రూ.30 లక్షల వరకు చెల్లించాడు. తన బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుని డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా అతని బ్యాంక్ అకౌంట్ ని బ్లాక్ చేశారు. ఎందుకు అలా జరిగింది అని అడగ్గా.. ఒక వీడియోకి మీరు డిస్ లైక్ కొట్టారు అందుకే అలా జరిగింది అంటూ చెప్పారు. తర్వాత కూడా అతడిని వదల్లేదు పన్నులు, సర్వీస్ ఛార్జెస్ అంటూ బ్లాక్ మెయిల్ చేసి ఇంకో రూ.11 లక్షలు లాగేశారు. అప్పటికి గానీ అతడికి బోద పడలేదు. అతను నిండా మునిగిపోయాడు అని. తేరుకున్న చౌహాన్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇలాంటి విషయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై సైబర్ సెల్ పోలీసులు నిత్యం హెచ్చరిస్తూనే ఉన్నామంటూ తెలిపారు. ఏ స్కీమ్ అయినా మీకు తేలిగ్గా డబ్బు వస్తోంది అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీరు ఉద్యోగం చేస్తే జీతం ఇస్తారు. మీ నుంచే డబ్బు అడుగుతున్నారు అంటే అది కచ్చితంగా భారీ మోసం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వాట్సాప్ లో ఏదైనా లింక్స్ ని క్లిక్ చేసే సమయంలో చైతన్యంతో ఉండాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి