iDreamPost
android-app
ios-app

ఇరాన్ మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ఇప్పటికీ ఆమె జైళ్లోనే

ఇరాన్ మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ఇప్పటికీ ఆమె జైళ్లోనే

ప్రపంచంలో అత్యంత విశిష్టమైన బహుమతి ఏదైనా ఉందంటే అది నోబెల్ ప్రైజ్ మాత్రమే. నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడమే కలగా ఎంతో మంది ఏళ్లకు ఏళ్లుగా కృషి చేసిన వారు ఉన్నారు. కాగా అంతటి ప్రాధాన్యత ఉన్న నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాదికి సంబంధించి ఆయారంగాల్లో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మహిళకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. కానీ ప్రస్తుతం ఆమె జైలులో ఉండడం కొసమెరుపు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? జైళ్లో ఎందుకు ఉన్నారు? ఆ వివరాలు మీ కోసం..

2023కు సంబంధించి నోబెల్ ప్రైజ్ లను గెలుచుకున్న విజేతలను నార్వే నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. దీనిలో భాగంగానే నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న విజేతను ప్రకటించారు. ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గెస్ మహమ్మది ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కాగా నార్గెస్ మహమ్మది లాయర్, ఫ్రీడం ఫైటర్.. ఈమె ఇరాన్ లో మానవ హక్కులు, అందరికీ స్వేఛ్చా అనే నినాదంతో ఉద్యమించారు. ఈ క్రమంలో ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం నార్గెస్ మహమ్మది ముందు నిలబడి పోరాటం చేసింది. గతేడాది ఇరాన్ లో ఓ యువతి హిజాబ్ ధరించలేదన్నకారణంగా పోలీసులు ఆమెను తీవ్రంగా కొట్టి ఆమె మృతికి కారణమయ్యారు.

దీంతో ఇరాన్ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఆ సమయంలో నార్గెస్ మహమ్మది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి ఉద్యమించింది. మహిళల హక్కులు, స్వేఛ్చ కోసం పోరాడిన నార్గెస్ మహమ్మదికి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. మానవ హక్కుల సాధన కోసం నార్గెస్ మహమ్మది పోరాటాలను చేశారు. దీంతో ఆమెను ఇరాన్ ప్రభుత్వం 13 సార్లు అరెస్ట్ చేసింది. అందులో 5 కేసుల్లో దోషిగా తేలారు. దీంతో ఆమెకు అన్ని కేసుల్లో కలిపి 31 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం నార్గెస్ మహమ్మది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైళ్లో ఉండగానే నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్న మహిళగా అరదైన గౌరవాన్ని పొందింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి