Swetha
ఇజ్రాయిల్ లో హమాస్ దాడి తర్వాత అక్కడ భారీగా కార్మికుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ భారత్ ను సహాయం అడుగగా.. భారత్ సహాయం చేస్తానని వాగ్దానం చేయగా.. మొదటి దశ కార్మికులను పంపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇజ్రాయిల్ లో హమాస్ దాడి తర్వాత అక్కడ భారీగా కార్మికుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ భారత్ ను సహాయం అడుగగా.. భారత్ సహాయం చేస్తానని వాగ్దానం చేయగా.. మొదటి దశ కార్మికులను పంపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Swetha
ఇజ్రాయిల్ మీద హమాస్ దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ క్రమంలో 2023 అక్టోబర్ లో జరిగిన హమాస్ దాడుల వలన ఇజ్రాయిల్ కు భారీ నష్టం ఏర్పడింది. దీనితో అక్కడ కార్మికుల అవసరం ఎక్కువగా ఏర్పడింది. అందుకోసం ఇజ్రాయిల్ ఇండియాను సహాయం అడిగింది. ఇరుగు పొరుగు దేశాలు ఇలా ఒకరికు సహాయం చేసుకుంటూనే.. కలిసికట్టుగా ముందుకు వెళ్లగలుగుతాం అని భావించి.. భారత్ సహాయం చేస్తానని వాగ్దానం చేసింది. ఈ క్రమంలో భారత్ నుంచి ఇజ్రాయిల్ కు మొదటి బ్యాచ్ కార్మికులు వెళుతున్నారు. మొదటి బ్యాచ్ లో మొత్తంగా 60 మదిని కార్మిక బృందం అక్కడకు చేరుకుంటోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇజ్రాయిల్ భారత్ ను సహాయం కోరిన క్రమంలో.. ఇండియా నుంచి లేబర్ కోసం.. ఇజ్రాయిల్ బృందం 15 మంది సభ్యులతో ఉత్తరప్రదేశ్, హర్యానాకు చేరుకుంది. ఈ క్రమంలోనే మొదటి దశలో భారత్ నుంచి 60 మంది కార్మికుల బృందం ఇజ్రాయిల్ కు వెళ్తున్నారు. వీరంతా కూడా మేస్త్రీలు, కార్పెంటర్లు, మిగిలిన అన్ని నిర్మాణ పనులలో నైపుణ్యం కలిగిన వారు.. ఈ కార్మికులంతా కూడా ఇజ్రాయెల్‌లో వివిధ రంగాలలో పని చేస్తారు. అయితే , హమాస్ దాడికి ముందు అక్కడ పాలస్తీనా కార్మికులు పనిచేశారు. కానీ, దాడి తర్వాత వారికీ అనుమతులు రద్దు చేశారు. గాజా సరిహద్దులు కూడా పాలస్తీనాలకు మూసివేయబడడంతో.. అక్కడ కార్మికుల కొరత అధికంగా ఏర్పడింది. దీనితో భారత్ ను సహాయం అడిగింది. మరి భారత్ కార్మికులకు అక్కడ ఎంత వేతనం లభిస్తోంది అనే విషయాలను కూడా చూసేద్దాం.
అయితే, భారత్ ఇక్కడ కార్మికులను ఇజ్రాయిల్ కు కాంట్రాక్ట్ పద్ధతిలో పంపుతున్నారు. ఈ క్రమంలోనే మొదటి దశలో 60 మంది కార్మికులు వెళ్లారు. భారత్ , ఇజ్రాయిల్ కు మధ్య ఉన్న ఈ కాంట్రాక్ట్ ఒక సంవత్సరం ఉండొచ్చు.. లేదా అంతకంటే ఎక్కువకాలం కూడా కొనసాగవచ్చు. ఇక భారత కార్మికుల విషయానికొస్తే.. ఇజ్రాయిల్ కు వెళ్లిన భారత కార్మికులకు ప్రతి నెల 100 ఇజ్రాయెలీ కొత్త షెకెల్స్ వేతనంగా లభిస్తాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. వారి ఒక నెల జీతం 1 లక్షా 37 వేల 260 రూపాయలు. పైగా 16,515 రూపాయల జీతం బోనస్‌గా ఇవ్వబడుతుంది. అంటే దాదాపుగా రూ. 1.50 లక్షలు వేతనంగా అందుతున్నమాట. ఇక జీతం మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం నుండి వైద్య బీమా, ఆహారం మరియు గృహాలను కూడా.. భారత్ కార్మికులు పొందుతారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.