iDreamPost
android-app
ios-app

నాలుగేళ్ల తర్వత ఇండియాకు.. కాసేపట్లో కన్న వారిని చూస్తాను అనుకుంది.. కానీ అంతలోనే

  • Published Jul 02, 2024 | 8:01 AM Updated Updated Jul 02, 2024 | 8:01 AM

భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న యువతి వాటిని సాధించుకోవడం కోసం విదేశాలకు వెళ్లింది. నాలుగేళ్ల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేందుకు విమానం ఎక్కింది. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న యువతి వాటిని సాధించుకోవడం కోసం విదేశాలకు వెళ్లింది. నాలుగేళ్ల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేందుకు విమానం ఎక్కింది. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Jul 02, 2024 | 8:01 AMUpdated Jul 02, 2024 | 8:01 AM
నాలుగేళ్ల తర్వత ఇండియాకు.. కాసేపట్లో కన్న వారిని చూస్తాను అనుకుంది.. కానీ అంతలోనే

ఉన్నత విద్య, మంచి ఉద్యోగం ఇలా కారణాలు ఏవైనా సరే.. విదేశాలకు వెళ్లే యువత సంఖ్య భారీగా పెరుగుతోంది. అక్కడ ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ.. చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ.. కన్నవారికి దూరంగా.. దేశం కానీ దేశంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. తమ కలల సాధన కోసం కష్టపడుతుంటారు. ఒకసారి విదేశాలకు వెళ్లిన వారు.. ఎప్పుడంటే అప్పుడు ఇండియాకు రాలేరు. మూడు, నాలుగేళ్లకు ఓకసారి స్వదేశానికి వచ్చి.. కన్న వారితో గడిపి వెళ్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉంటున్న భారతీయలు దాడికి గురవుతూ.. ఆఖరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇక తాజాగా ఓ యువతి నాలుగేళ్ల క్రితం విదేశాలకు వెళ్లింది. ఇన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వస్తుంది. మరి కొన్ని గంటల్లో కన్నవారిని చూసుకుంటాను అనుకునే సమయానికి అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఏన్నో కలలతో ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టిన 24 ఏళ్ల యువతి.. 4 సంవత్సరాల తర్వాత కుటుంబసభ్యులను కలిసేందుకు ఇండియా వస్తూ విమానంలోనే మృతి చెందింది. ఇక కుమార్తె కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు.. కన్నబిడ్డ కన్ను మూసింది అని తెలిసి కుప్పకూలారు. జూన్ 20న మెల్‌బోర్న్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూస్.కామ్.ఏయూ కథనం ప్రకారం.. భారత్‌కు చెందిన మన్‌ప్రీత్‌ కౌర్‌ అనే యువతి తన 20వ ఏట ఉన్నత విద్య నిమిత్తం.. 2020లో ఆస్ట్రేలియా వెళ్లింది. కుకింగ్ అంటే ఇష్టపడే మన్‌ప్రీత్‌కు చెఫ్ కావాలనేది కల. ఆస్ట్రేలియా పనిచేస్తూనే.. వంటకు సంబంధించిన కోర్సులు చేస్తోంది.

2020లో ఆస్ట్రేలియా వెళ్లి.. సుమారు నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు ఇండియాకు బయల్దేరింది మన్‌ప్రీత్‌. ఈ క్రమంలో గత నెల అనగా జూన్‌ 20న మెల్‌బోర్న్‌ విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ నుంచి ఢిల్లీ వచ్చే క్వాంటాస్ విమానం ఎక్కింది. మరి కాసేపట్లో ఫ్లైట్‌ టేకాఫ్‌ కాబోతుండగా.. సీటు బెల్టు ధరించాలని క్రూ సిబ్బంది ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. అందరూ సీటు బెల్టు ధరించగా.. మన్‌ప్రీత్ మాత్రం బెల్టు పెట్టుకునే సమయలో ఇబ్బంది పడింది. క్రూ సిబ్బంది ఆమె వద్దకు చేరుకుంటుండగానే.. ఆమె ఒక్కసారిగా తన సీటు ముందు భాగంలో కుప్పకూలింది.

అప్పటికి విమానం ఇంకా టేకాఫ్ కాకపోవడంతో సిబ్బంది వెంటనే మన్‌ప్రీత్‌ను కిందికి తీసుకొచ్చి చికిత్స కోసం  తరలించారు. అయితే, మన్‌ప్రీత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మన్‌ప్రీత్ కౌర్‌ కొంతకాలంగా టీబీ (క్షయ) వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె స్నేహితుడు, రూమ్‌మేట్ కుల్దీప్ తెలిపాడు. అంతేకాక ఎయిర్‌పోర్టుకు వచ్చే సమయంలోనే మన్‌ప్రీత్ అస్వస్థతకు గురైందట. చికిత్స తర్వాత ఆరోగ్య పరిస్థితి కుదటపడడంతో ప్రయాణానికి సిద్ధమైందని కుల్దీప్ వెల్లడించాడు. ఈ ఘటనపై స్పందిస్తూ.. క్వాంటాస్‌ విమానయాన సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈ కష్ట సమయంలో మన్‌ప్రీత్ కౌర్ కుటుంబసభ్యులకు అండగా ఉండేందుకు ఆమె స్నేహితులు గోఫండ్‌మీ వెబ్‌సైట్ ద్వారా ఫండ్ రెయిజ్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.