iDreamPost
android-app
ios-app

12 ఏళ్ల భారత్ పిల్లాడు.. అమెరికాలో సూపర్ రికార్డ్..!

Indian Origin Boy: భారతీయులు ఎంతో మంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. అలానే అమెరికా దేశానికి కూడా చాలా మంది ఇండియన్స్ వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు అరుదైన రికార్డును సాధిస్తున్నారు.

Indian Origin Boy: భారతీయులు ఎంతో మంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. అలానే అమెరికా దేశానికి కూడా చాలా మంది ఇండియన్స్ వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు అరుదైన రికార్డును సాధిస్తున్నారు.

12 ఏళ్ల భారత్ పిల్లాడు.. అమెరికాలో సూపర్ రికార్డ్..!

ప్రతి మనిషిలో ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అందుకే చాలా మంది ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంటారు. అంతేకాక తమ టాలెంట్ తో ఎన్నో రికార్డులు సృష్టిస్తుంటారు. ఇక ఈ ప్రతిభ అనేది ప్రత్యేకంగా ఫలాన వయసుకు అంటూ ఏమి  ఉండదు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు చాలా మంది  తమలోని ప్రతిభతో ఔరా అనిపిస్తుంటారు. తాజాగా ఓ 12 భారతీయ బాలుడు.. ఏకాంగా అమెరికాలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మరి..ఆ బాలుడు సృష్టించిన చరిత్ర ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయులు ఎంతో మంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. అలానే అమెరికా దేశానికి కూడా చాలా మంది ఇండియన్స్ వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. దీంతో వారి పిల్లల చదువులు కూడా అక్కడే కొనసాగుతుంటాయి. అలానే భారతీయ సంతతికి చెందిన పిల్లలు విదేశాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అంతేకాక అరుదైన రికార్డులతో భారత దేశ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరింత ఇనుమడింప చేస్తున్నారు.

తాజాగా భారతీయ సంతతికి చెందిన 12 ఏళ్ల బాలుడు సుబోర్నో ఐజాక్ బారీ చరిత్ర సృష్టించే దిశాగా అడుగులు వేస్తున్నాడు. హైస్కూల్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన విద్యార్థిగా సుబోర్నో ఐజాక్ బారి రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ది న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే వారం లాంగ్ ఐలాండ్ హైస్కూల్ నుండి గ్రాడ్యుయేట్ చేసిన అతి పిన్న వయస్కుడైన స్టూడెంట్ గా సుబోర్నో బారీ అవుతాడని పేర్కొంది. న్యూయార్క్‌లోని మాల్వెర్నే హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో గణితం, భౌతిక శాస్త్రాన్ని చదవనున్నాడు. అక్కడ  ఇటీవలే అతను పూర్తి స్కాలర్‌షిప్ కూడా పొందాడు.

 ఇక సుబోర్నో ఐజాక్ తన విజయాల గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన పేరెంట్స్ కి కృతజ్ఞతలు తెలిపాడు. 12 ఏళ్ల వయస్సులో, తాను మాల్వెర్న్ హై స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నాని తెలిపాడు. వచ్చే నెల నా గ్రాడ్యుయేషన్ పూర్తి కానుందని పేర్కొన్నారు. తాను 12 ఏళ్ల వయస్సులో హైస్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయిన మొదటి అమెరికన్ అవుతానని సుబోర్నో తన ఫేస్‌బుక్ అకౌంట్ లో  రాసుకొచ్చారు. సుబోర్నో ఐజాక్ బారీ రెండు పుస్తకాలు రాశాడు.  అంతేకాక ఇండియన్ విశ్వవిద్యాలయంలో ప్రసంగం కూడా  ఇచ్చారు.  ప్రొఫెసర్‌గా ఉండటం, అవసరమైన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడమే తన లక్ష్యమని సుబోర్న్ చెప్పుకొచ్చారు.