iDreamPost
android-app
ios-app

కూతురిపై తండ్రి ప్రేమ.. ఏకంగా ఆకాశంలో పెళ్లి..

ఆ తండ్రి తన కూతురి పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలి అని అనుకున్నాడు. ఇందు కోసం ఏకంగా విమానంలో ఆమె పెళ్లి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..

ఆ తండ్రి తన కూతురి పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలి అని అనుకున్నాడు. ఇందు కోసం ఏకంగా విమానంలో ఆమె పెళ్లి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..

కూతురిపై తండ్రి ప్రేమ.. ఏకంగా ఆకాశంలో పెళ్లి..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని ఘట్టం. మరి, అలాంటి పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆర్థిక స్తోమతను బట్టి.. ఎవరికి తోచినంతలో వాళ్ళు పెళ్ళిళ్ళను చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ విషయంలో ధనవంతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ ఇళ్లలో పెళ్లిసందడిని నలుగురికి గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా చేస్తుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అని, బీచ్ వెడ్డింగ్ అని, ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ వ్యాపారి తన కూతురి పెళ్లి జరిపించిన తీరు చూస్తే.. ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఏకంగా ఈ పెద్దమనిషి ఆకాశవీధుల్లో తన కూతురి పెళ్లిని జరిపించి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

భారత్ కు చెందిన బిజినెస్ మ్యాన్ దిలీప్ పోప్లీ.. యూఏఈలో స్థిరపడ్డారు. ఆయన తన కుమార్తె విధి పోప్లీకి నవంబరు 24న పెళ్లి జరిపించారు. అది కూడా గగన వీధుల్లో ఘనంగా చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా ఓ విమానాన్ని పెళ్లి మండపంగా మార్చేశారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టులోని రన్ వే మీద కొత్త జంటను ఊరేగించారు. దిలీప్ తన కూతురి పెళ్లి కోసం ఏకంగా ప్రైవేట్‌ బోయింగ్‌-747ను  వాడారు. బోయింగ్‌లో పెళ్లి కోసం వరుడు హృదేశ్‌ సైనాని, వధువు విధితో పాటు 350 మంది అతిథులు హాజరయ్యారు.

అంతకు ముందు వరుడు బరాత్‌తో డాన్స్‌ చేస్తూ విమాన రన్‌వే వరకు వచ్చారు. తర్వాత విమానం దుబాయ్‌ ప్రైవేట్‌ టెర్మినల్‌ నుంచి ఒమన్‌కు బయలుదేరింది. నీలి ఆకాశపు అంచులలో ఉండగానే ఈ జంట వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుక కోసం మూడు గంటల పాటు గగన తలంలో విమానం చక్కర్లు కొట్టింది. ఈ పెళ్లిపై వరుడు మాట్లాడుతూ..  ‘విధి నా చిన్ననాటి స్నేహితురాలు.. హైస్కూల్‌ వరకూ ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఆమెను వివాహం చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది.

అది విమానంలో ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై’ అంటూ తన ఆనందనాన్ని వ్యక్తపరిచాడు. తన మామ దిలీప్ పోప్లీ, తండ్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసినందుకు ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్ ఆపరేటర్ జెటెక్స్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వధువు విధి మాట్లాడుతూ ‘‘నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేనెప్పుడూ ఊహించలేదు. నా తల్లిదండ్రుల వివాహం కూడా విమానంలోనే జరిగింది. కానీ, నేను అది చూడలేదు. మా కోసం మళ్లీ అలాంటి ఏర్పాట్లు చేశారు’’ అని తెలిపింది.

ఏదేమైనా, భారత్‌లో ప్రతిష్టాత్మక జ్యువెలరీ సంస్థల ఓనర్‌ అయిన పోప్లీ కుటుంబానికి ఇలాంటి వేడుకలు కొత్త కాదు. గతంలోనూ ఆ కుటుంబానికి చెందిన వారి వివాహాలు ఇలా విమానంలోనే జరిగాయి. ఇక, ఈ వివాహంతో దిలీప్ పోప్లీ తన కూతురి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి, ఈ పెళ్లి వేడుకపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.