iDreamPost
android-app
ios-app

చేయని తప్పుకు పదేళ్లు జైలు శిక్ష! బాధితుడికి రూ.419 కోట్ల పరిహారం!

USA News: కొన్ని సార్లు చేయని తప్పుకు శిక్షలు అనుభవిస్తుంటారు. అలానే ఓ వ్యక్తి విషయంలో కూడా జరిగింది. ఏ తప్పు చేయకుండా ఇన్నాళ్లు జైలు జీవితం గడిపిన తనకు న్యాయం కావాలని కోర్టు మెట్లు ఎక్కాడు. అతడి వాదనలను సమర్దించిన కోర్టు..భారీ ఉపశమనం ఇచ్చింది.

USA News: కొన్ని సార్లు చేయని తప్పుకు శిక్షలు అనుభవిస్తుంటారు. అలానే ఓ వ్యక్తి విషయంలో కూడా జరిగింది. ఏ తప్పు చేయకుండా ఇన్నాళ్లు జైలు జీవితం గడిపిన తనకు న్యాయం కావాలని కోర్టు మెట్లు ఎక్కాడు. అతడి వాదనలను సమర్దించిన కోర్టు..భారీ ఉపశమనం ఇచ్చింది.

చేయని తప్పుకు పదేళ్లు జైలు శిక్ష! బాధితుడికి రూ.419 కోట్ల పరిహారం!

తప్పు చేసిన వారికి  శిక్ష అనేది తప్పనిసరిగా పడాలి. అప్పుడే నేరాలు అనేవి అదుపులో ఉంటాయి. కానీ,  కొన్ని సందర్భాల్లో ఏ నేరం చేయని వారు కూడా అన్యాయంగా జైలు పాలు అవుతారు. దీంతో వారి జీవితంలోని అమూల్యమైన సమయాన్ని నష్టపోతారు. అలానే ఒక వ్యక్తి చేయని నేరానికి ఒకటి, రెండు ఏళ్లు  కాదు.. ఏకంగా పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తాను ఏ తప్పు చేయలేదని మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా పదేళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. అయితే చివరికి న్యాయమే గెలిచింది. అతడు ఏ తప్పు చేయలేదని రుజువు కావడంతో అతడిని విడుదల చేశారు. అయితే ఏ తప్పు చేయకుండా ఇన్నాళ్లు జైలు జీవితం గడిపిన తనకు న్యాయం కావాలని కోర్టు మెట్లు ఎక్కాడు. అతడి వాదనలను సమర్దించిన కోర్టు..భారీ ఉపశమనం ఇచ్చింది. 10 ఏళ్ల జీవితం జైలు పాలైనందుకు 50 మిలియన్‌ డాలర్ల  అంటే మన ఇండియన్స్ కరెన్సీలో దాదాపు 419 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరి..ఈ ఘటన ఎక్కడ జరిగింది. అసలు ఈ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కేసు పూర్వవివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఇల్లినాయిస్ ప్రాంతానికి చెందిన  మార్సెల్ బ్రౌన్(34) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.  2008లో 19 ఏళ్ల యువకుడ్నిమార్సెల్ బ్రౌన్ హత్య చేశాడన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య కేసుకు  సంబంధించి స్థానిక కోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా బ్రౌన్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. అతడికి ఈ కేసులో 35 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో దాదాపు పదేళ్లు గడిచిన తరువాత బ్రౌన్ కేసు మరో కొత్త మలుపు తిరిగింది.

బ్రౌన్ తో బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేశారని 2018లో అతడి తరపు లాయర్లు తీర్పును సవాల్ చేశారు. అందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా చిగాగో ఫెడరల్ జ్యూరీ కోర్టుకు అందించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు… బ్రౌన్ పై ఉన్న కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాక బ్రౌన్ ను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే అప్పటికే అతడు దాదాపు 10 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. తాను ఏ తప్పు చేయకున్నా కూడా పదేళ్లు జైలు జీవితాన్ని గడిపానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరగాలంటూ మరోసారి కొర్టు మెట్లు ఎక్కాడు. దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్‌ కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది.

తప్పుడు కేసులో బ్రౌన్‌ను అరెస్టు చేసినందుకు 10 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని తెలిపింది. అలానే పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు మరో 40 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని పేర్కొంది. రెండు కలిపి మొత్తం 50 మిలియన్ డాలర్లు  బ్రౌన్ కి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  50 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.419 కోట్ల  ఉంటుంది. కోర్టు తీర్పుపై బాధితుడు హర్షం వ్యక్తం చేశాడు. ఇంత పెద్ద మొత్తంలో జ్యూరీ పరిహారం చెప్పడం అమెరికా చరిత్రలోనే ఇదే మొదటిసారి. కాగా, గతంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగాయి.

ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్ కూడా ఓ హత్య కేసులో కోర్టు మరణ శిక్ష విధించింది. తర్వాత దీనిని యావజ్జీవిత ఖైదుగా మార్చింది. అయితే, అతడికి నేరంతో సంబంధం లేదని సాక్ష్యాలతో సహా కోర్టులో నిరూపించబడింది. దీంతో అతడ్ని విడుదల చేసి.. పరిహారం కింద రూ.119 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మార్సెల్ బ్రౌన్ కేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.