సమాజంలో కొత్త ట్రెండ్! ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ చేసుకుంటున్న యువతీయువకులు!

ఏవండోయ్ ఇది విన్నారా..? ఇప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. పెళ్లి అంటే భయపడుతున్నారా.. లివింగ్ రిలేషన్ షిప్ అంటే ఆసక్తి లేదా.. అయితే ఇప్పుడు కొత్త రిలేషన్ వచ్చిందండోయ్. అదే ఫ్రెండ్ షిప్ మ్యారేజ్. ఇంతకు అది ఏంటీ అనుకుంటున్నారా..?

ఏవండోయ్ ఇది విన్నారా..? ఇప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. పెళ్లి అంటే భయపడుతున్నారా.. లివింగ్ రిలేషన్ షిప్ అంటే ఆసక్తి లేదా.. అయితే ఇప్పుడు కొత్త రిలేషన్ వచ్చిందండోయ్. అదే ఫ్రెండ్ షిప్ మ్యారేజ్. ఇంతకు అది ఏంటీ అనుకుంటున్నారా..?

‘కొత్త ఒక వింత- పాత ఒక రోత’ అన్నారు పెద్దలు. కాలం మారినప్పుడు, ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్నప్పుడు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఇది వివాహ బంధానికి కూడా వర్తిస్తుంది. ఒకప్పుడు ఈడు వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలకు కుటుంబ పెద్దలు పెళ్లిళ్లు చేసేవారు. ఆ తర్వాత కాలంలో లవ్ మ్యారేజెస్ వచ్చాయి. ఆ తర్వాత మ్యారేజ్ వద్దు.. లివింగ్ రిలేషన్ ముద్దు అని కొత్త రాగం అందుకున్నారు. ఇష్టమొచ్చినంత కాలం ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా అమ్మాయి, అబ్బాయి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఇందులో సెక్స్ కూడా ఓ పార్ట్. ఈ మధ్య కాలంలో లెస్బియన్స్, గేలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో నయా ట్రెండ్ పుట్టుకు వచ్చింది. అదే ఫ్రెండ్ షిప్ మ్యారేజ్.

జపాన్ దేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఇచ్చిన కథనం ప్రకారం.. ఇందులో సెక్స్, ప్రేమ ఏమీ ఉండవు. కేవలం స్నేహా పూర్వక సంబంధం మాత్రమే ఉంటుంది. 124 మిలియన్స్ జనాభా ఉన్న జపాన్‌లో 1 శాతం మంది యువత.. దీని వైపు మొగ్గు చూపుతున్నారు. లైంగిక సంబంధాలను ఇష్టపడనివారు, స్వలింగ సంపర్క వివాహాలు, సాంపద్రాయ వివాహాల పట్ల అనాసక్తి చూపుతున్న వారంతా.. దీనికి ఆకర్షితులవుతున్నారు. కలర్స్ అనే ఏజెన్సీ సేకరించిన డేటా ప్రకారం.. 2015లో మొదలైంది ఈ ప్రక్రియ. ఇప్పటి వరకు 500 మంది ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ చేసుకున్నారు. కాపురాన్ని కూడా స్టార్ చేస్తున్నారు. ఈ రిలేషన్‌లో ఫిజికల్ రిలేషన్ షిప్ ఉండని నేపథ్యంలో పిల్లలు ఎలా అనుకోవచ్చు. ఈ దంపతులు పిల్లల్ని పెంచుకునే అవకాశం ఉంది.

ఇంతకు ఈ ఫ్రెండ్ షిఫ్ మ్యారేజ్ అంటే ఏమిటంటే..చట్టపరంగా పెళ్లి చేసుకుంటారు కానీ.. ప్రేమా, గీమా జాన్తానయ్. కలిసైనా ఉండొచ్చు.. విడిగా కూడా జీవించొచ్చు. కృత్రిమ గర్భదారణ ద్వారా కూడా పిల్లల్ని కనాలని నిర్ణయించుకోవచ్చు. ఈ మ్యారేజ్ చేసుకున్న వారు.. పరస్పర అంగీకారంతో వేరే వ్యక్తులతో సెక్స్,రిలేషన్ లో ఉండేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ అంటే ఓ పెళ్లి అనే రిలేషన్‌లా కాకుండా రూమ్మేట్స్ లా జీవించడమని.. దీన్ని ఫాలో అవుతున్నవ్యక్తి వెల్లడించారు. కాగా, ఈ మ్యారేజ్ చేసుకున్న 80 శాతం మంది జంటలు చాలా సంతోషంగా ఉన్నట్లు కలర్స్ ఏజెన్సీ వెల్లడించింది. సగటున 32 ఏళ్లు ఉన్న జపాన్ యువత ఇలాంటి వివాహాలను ఇష్టపడుతున్నట్లు తెలిపింది. ఈ రకమైన సంబంధాలు వద్దు అనుకుంటే.. విడిపోవచ్చు. పాలసీ నిబంధనల ప్రకారం ముందుకు సాగవచ్చు. ఇది చదివాక.. మనకు ఇలాంటిది వస్తే బాగుణ్ణు అనిపిస్తుంది కదా

Show comments