వీడియో: రష్యాలో 9/11 తరహా దాడి.. సరతోవ్‌లోని బహుళ అంతస్తును ఢీ కొన్న డ్రోన్!

War Between Ukraine Russia: గత కొంత కాలంగా ఉక్రెయిన్- రష్యాల మధ్య భీకర యుద్దం కొనసాగుతుంది. పరస్పర దాడుల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. పలు మార్లు ఇరు దేశాల మధ్య యుద్ద విరమణ ప్రస్తావన వచ్చినా.. కొన్ని కారణాల వల్ల మళ్లీ కొనసాగుతూ వస్తుంది. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ పెద్ద దాడి చేసింది.

War Between Ukraine Russia: గత కొంత కాలంగా ఉక్రెయిన్- రష్యాల మధ్య భీకర యుద్దం కొనసాగుతుంది. పరస్పర దాడుల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. పలు మార్లు ఇరు దేశాల మధ్య యుద్ద విరమణ ప్రస్తావన వచ్చినా.. కొన్ని కారణాల వల్ల మళ్లీ కొనసాగుతూ వస్తుంది. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ పెద్ద దాడి చేసింది.

ఉక్రెయిన్ – రష్యాల మధ్య యుద్దం రోజు రోజుకీ ఉగ్ర రూపం దాల్చుతుంది. ఇటీవల ఉక్రెయిన్ సైన్యం రష్యాపై దాడిని పెంచుతూ వస్తుంది. ఇప్పటికే ఉక్రయిన్ మిలటరీ దళాలు రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయాయినట్లు సమాచారం. తాజాగా సోమవారం (ఆగస్టు 26) రష్యాపై ఉక్రయిన్ సరతోవ్‌లోని భారీ భవనంపై 9/11 తరహా దాడి చేసింది. అమెరికాలోని న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా దాడి చేసినప్పుడు ఘటనను 9/11 అని పిలుస్తారు. ఈ ఘటనలో వేల మంది చనిపోయారు. రష్యాలోని ఎత్తైన భవనాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడిలో భారీ నష్టమే జరిగినట్లు గవర్నర్ తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రష్యాపై ఉక్రెయిన్ దాడులు తగ్గేదే లే అంటుంది. ఈసారి ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని సరతోవ్‌ లోని బహుళ అంతస్తులు టార్గెట్ చేసుకొని 20 డ్రోన్ లను ప్రయోగించినట్లు సమాచారం. ఇందులో ఒక డ్రోన్ సరతోవ్‌ లోని నివాస భవనాన్ని ఢీ కొట్టింది. ఈ దాడిలో సగం భవనం బాగా దెబ్బతిన్నదని, ఈదాడి లో ఒఖ మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. కాగా, టెలిగ్రామ్ మెసేసింగ్ యాప్ లో సరోతోవ్ గవర్నర్ రొమోన్ బుసర్గిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సైన్యం సరతోవ్ నగరంలో ఉన్న అతి పెద్ద భవనం పై డ్రోన్ తో దాడులు చేశారు. ఈ దాడిలో భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. ఒక మహిళకు గాయం కావడంతో వైద్యులు ఆహె ప్రాణాలు రక్షించే ప్రయత్నంలో ఉన్నారు’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. అంతకు ముందే.. రాజధాని మాస్కోకు వందల కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతంలోని ప్రధాన నగరాలైన సరతోవ్, ఎంగెల్స్ లోని పలు ప్రాంతాల్లో అత్యవసర సేవలను మూసివేస్తున్నామన్నారు.

ఉక్రెయిన్ 20 డ్రోన్‌లతో దాడి చేసింది.. అందులో ఎక్కువగా సరతోవ్ లో కాల్పులు జరిపిందని గవర్నర్ తెలిపారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నామని అన్నారు గవర్నర్. కుర్స్క్‌పై 3, బెల్గోరోడ్ ఒబ్లాస్ట్ పై 2, బ్రయాన్స్ పై 2, ఓర్లోవ్ స్కాపై 1, తుల్స్‌కయాపై, రియాజాన్ ప్రాంతంలో 1 డ్రోన్ లను కాల్చారు. ఇదిలా ఉంటే.. రష్యా ఎంగేల్స్ లో మాస్కో ఒక పెద్ద బాంబర్ సైనిక స్థావరాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం డ్రోన్ భవనాన్ని ఢీ కొట్టిన దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ దృష్యాలను చూస్తుంటే.. గతంలో 9/11 గుర్తుకు వస్తుందని నెటిజన్లు అంటున్నారు.

Show comments