nagidream
Dr Philip Nitschke Invented Sarco Pod For Humans: ఆత్మహత్య అనేది ఏ దేశంలోనూ ఆమోదించబడదు. ఎవరైనా తెలిసి తెలిసి ఆత్మహత్య చేసుకుంటే ఆపుతారు. కానీ ఈ డాక్టర్ మాత్రం చనిపోవాలనుకునేవాళ్ళని చనిపోనివ్వమని అంటాడు. అంతేకాదు.. నొప్పి లేకుండా చనిపోయేలా ఒక పరికరాన్ని కూడా తయారు చేశాడు.
Dr Philip Nitschke Invented Sarco Pod For Humans: ఆత్మహత్య అనేది ఏ దేశంలోనూ ఆమోదించబడదు. ఎవరైనా తెలిసి తెలిసి ఆత్మహత్య చేసుకుంటే ఆపుతారు. కానీ ఈ డాక్టర్ మాత్రం చనిపోవాలనుకునేవాళ్ళని చనిపోనివ్వమని అంటాడు. అంతేకాదు.. నొప్పి లేకుండా చనిపోయేలా ఒక పరికరాన్ని కూడా తయారు చేశాడు.
nagidream
మనిషి సవాలక్ష సమస్యలతో నిత్యం దిన దిన గండంతో బతుకుతున్నాడు. అయితే కొంతమందికి చనిపోవాలని అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆగిపోతారు. ఆగిపోవాలి అదే న్యాయం కూడా. హత్యే కాదు ఆత్మహత్య కూడా నేరమే. అయితే ఒక చోట మాత్రం చనిపోవాలనుకోవడం నేరం కాదు. పైగా అక్కడ చనిపోయేందుకు సపోర్ట్ చేస్తారు. చనిపోవాలనుకున్న వ్యక్తి వెళ్లి డబ్బులు చెల్లిస్తే నొప్పి లేకుండా చంపేస్తారు. ఇది అక్కడ లీగల్ కూడా. మామూలుగా ఎవరైనా మనిషి నేను చనిపోతున్నా అని మన దగ్గరకు వస్తే.. ఆపాలని చూస్తాం కదా. కానీ ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్.
ఆస్ట్రేలియాకి చెందిన ఫిలిప్ నిట్స్కే అనే ఒక డాక్టర్ సులువుగా నొప్పి లేకుండా చనిపోయేలా ఒక యంత్రాన్ని కనిపెట్టాడు. ఇతనికి ‘డాక్టర్ డెత్’ అనే పేరు కూడా ఉంది. సార్కో 3డీ ప్రింటెడ్ క్యాప్సూల్ ని వెనిస్ డిజైన్ ఫెస్టివల్ లో భాగంగా 2019లో పరిచయం చేశారు. 10 నిమిషాల్లో ఒక వ్యక్తికి ఒకే ఒక్క బటన్ తో నొప్పి లేని మరణాన్ని అందిస్తుందట. ఇది ఒక పాడ్ లా ఉంటుంది. ఈ పాడ్ లోకి చనిపోవాలనుకున్న మనిషి వెళ్లి పడుకుంటే చాలు. ఇందులో ఉన్న నైట్రోజన్ ఆక్సిజన్ స్థాయిని వేగంగా తగ్గిస్తుంది. ఈ కారణంగా మొదటి నిమిషంలోనే అందులో ఉన్న మనిషి స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత 10 నిమిషాల్లో ప్రశాంతమైన, ఉల్లాసమైన మరణాన్ని ఆ వ్యక్తి చూస్తారని దీన్ని తయారు చేసిన డాక్టర్ వెల్లడించారు.
ప్రస్తుతం ఇది స్విట్జర్లాండ్ లో ఉంది. ఈ యంత్రాన్ని స్విట్జర్లాండ్ దేశంలో లీగల్ అయినప్పటికీ.. స్విస్ క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 115 కింద చనిపోవాలనుకున్న వ్యక్తి స్వార్థపూరితమైన కారణాలు చెప్పకూడదని చట్టం ఉంది. అలానే ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించినా లేదా ఆత్మహత్యకు సహాయం చేసినా కూడా నేరమే. ఆత్మహత్య చేసుకునేలా చేసినా, ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించే ప్రయత్నం చేసినా నేరమే. ఈ నేరానికి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే అక్కడ అధికారులు ఈ పరికరాన్ని నిషేధించాలని.. వేరొకరిని చనిపోయేందుకు ప్రేరేపించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అయితే ఒక మనిషి
ఈ ఫిలిప్ అనే డాక్టర్ దగ్గరకు చాలా మంది భయంకరమైన జబ్బులతో వచ్చేవారట. వాళ్ళందరూ బతకలేమని, చంపేయమని అడిగేవారట. దీంతో అతను నొప్పి లేకుండా చంపడంలో స్పెషలిస్ట్ అన్న పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ డెత్ పాడ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజానికి ఏ దేశంలోనూ ఆత్మహత్యను ఒప్పుకోరు. చట్టాలు ఒప్పుకోవు. కానీ ఒక్క స్విట్జర్లాండ్ లో మాత్రమే లీగల్ ఉంది. ఈ చట్టం 1940లో వచ్చింది. ఎవరైనా చనిపోవాలనుకుంటే అసిస్టెంట్ సహాయంతో చనిపోవచ్చునట. అప్పుడు తీసుకొచ్చిన ఈ రూల్ ఇంకా కొనసాగుతుంది. ఈ డెత్ డాక్టర్ కనిపెట్టిన ఈ పాడ్ ద్వారా చనిపోవాలంటే ఆ మనిషి 20 యూఎస్ డాలర్స్ చెల్లించాలంట. అంటే మన కరెన్సీ ప్రకారం 1673 రూపాయలన్నమాట. మరి మనిషిని చంపే మిషన్ ని కనిపెట్టిన డెత్ డాక్టర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.