మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2024‌గా ధృవీ పటేల్.. తన కోరిక ఏంటో తెలుసా?

Miss India Worldwide 2024: న్యూ జెర్సీలో ఇండియా ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేసిన ‘మిస్ వరల్డ్ వైడ్ 2024’ ఈ వెంట్ లో ప్రవాస భారతీయురాలు ధృవి పటేల్ కి అరుదైన గౌరవం దక్కింది.

Miss India Worldwide 2024: న్యూ జెర్సీలో ఇండియా ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేసిన ‘మిస్ వరల్డ్ వైడ్ 2024’ ఈ వెంట్ లో ప్రవాస భారతీయురాలు ధృవి పటేల్ కి అరుదైన గౌరవం దక్కింది.

ప్రవాస భారతీయుల ప్రతిష్టాత్మక  ‘మిస్ వరల్డ్ వైడ్ 2024’ 31వ వార్షికోత్సవ పోటీలు న్యూ జెర్సీలో జరిగాయి. ఈ పోటీలో యూఎస్ఏ కు చెందిన ప్రవాస భారతీయురాలు ధ్రువీ పటేల్ విజేతగా నిలిచి కిరీటాన్ని సంతం చేసుకుంది. ప్రస్తుతం ధృవి పటేల్ అమెరికాలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యనభ్యసిస్తుంది. తనకు మిస్ వరల్డ్ వైడ్ 2024 కిరీటం దక్కడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ధృవి పటేల్ తన మనసులో కోరికలు వేధికపై పంచుకుంది. ఇంతకీ ధృవీ ఏం చెప్పింది.. తన కోరిక ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

యూఎస్ఏకు చెందిన ప్రవాస భారతీయురాలు ధృవి పటేల్ మిస్ వరల్డ్ వైడ్ 2024 కిరీటం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ మిస్ వరల్డ్ వైడ్ విజేతగా నిలవడం నా జీవితంలో గొప్ప అచీవ్‌మెంట్.. గౌరవం. ఇది కేవలం కీరీటం మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. నాకు బాలీవుడ్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక. అలాగే యూనిసెఫ్ అంబాసిడర్ గా రాణించాలని ఉంది’ అని అన్నారు. ఇదిలా ఉంటే..  ఈ పోటీల్లో సురినామ్ కు చెందిన లిసా మొదటి రన్నరప్ గా నిలవగా.. నెదర్లాండ్స్ కు చెందిన మాళవిక శర్మ రెండో రన్నరప్ గా నిలిచింది.

ఇక మిసెస్ కేటగిరిలో ట్రినిడాడ్ కు చెందిన సుఅన్ మౌటెట్ విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది. స్నేహ నంబియార్ మొదటి, యూకేకు చెందిన పవన్ దీప్ కౌర్ రెండవ రన్నరప్ గా నిలిచారు. టీన్ కేటగిరిలో గ్వాడె‌లోప్ కు చెందిన సియెర్రా సురెట్ మిస్ టిన్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. అలాగే నెదర్లాండ్ నుంచి శ్రేయా సింగ్ ఫస్ట్, సురినామ్ కు చెందిన శ్రద్దా టెడ్జో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. న్యూయార్క్ కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ 31 ఏళ్లుగా ఈ అందాల పోటీ నిర్వహిస్తుంది. ఇండో అమెరికన్లు నీలం, ధర్మాత్మ శరణ్ లు ఈ ఈవెంట్ నిర్వహకులుగా కొనసాగుతున్నారు.

Show comments