iDreamPost
android-app
ios-app

ముఖాలు నల్లగా ఉన్నాయని విద్యార్థులను స్కూల్ నుంచి బహిష్కరణ!

Saint Francis School To Pay 20 Million To Expelled Students: విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఓ పాఠశాలకు న్యాయస్థానం తగిన శాస్తి చేసింది. విద్యార్థులకు కోట్లలో పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.

Saint Francis School To Pay 20 Million To Expelled Students: విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఓ పాఠశాలకు న్యాయస్థానం తగిన శాస్తి చేసింది. విద్యార్థులకు కోట్లలో పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.

ముఖాలు నల్లగా ఉన్నాయని విద్యార్థులను స్కూల్ నుంచి బహిష్కరణ!

పాఠశాల అంటే విద్యా బుద్ధులు నేర్పాలి. సమాజంలో ఎలా మెలగాలి? అందరితో మంచిగా ఎలా ఉండాలి? మంచి అంటే ఏంటి? అసలు సంస్కారం అంటే ఏంటో విద్యార్థులకు తెలిసొచ్చేలా చేయాలి. వారిని సన్మార్గంలో నడిపించాలి. అలాంటి ఒక విద్యా సంస్థ విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. వారు తన మిత్రుడి కోసం చేసిన ఒక మంచి పనిని అర్థం చేసుకోకపోగా.. వారిని పాఠశాల నుంచి బహిష్కరించింది. ఆ విద్యార్థుల భవిష్యత్ గురించి కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా.. యాజమాన్యం వారిని పాఠశాల నుంచి బహిష్కరించింది. ఈ ఘటనలో న్యాయస్థానం ఆ విద్యా సంస్థకు గడ్డి పెట్టింది.

ఈ దారుణమైన ఘటన కాలిఫోర్నియాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాలలో జరిగింది. 2017లో ఇద్దరు యువకులు తన మిత్రుడికి సంఘీభావం తెలిపేందుకు ఒక పని చేశారు. అది వారిని పాఠశాల నుంచి బహిష్కరించేలా చేసింది. విషయం ఏంటంటే.. ఇద్దరు విద్యార్థులు తమ మిత్రుడికి మొటిమల చికిత్స చేయగా.. అతనికి సంఘీభావం తెలుపుతూ బ్లాక్ మాస్కులు ధరించి ఫొటో దిగారు. ఆ ఫొటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు అటు తిరిగి ఇటు తిరిగి యాజమాన్యం దగ్గరకు కూడా వెళ్లాయి.

ఆ ఫొటోలు ఆ విద్యార్థుల ముఖాలా నల్లగా ఉన్నాయని చెప్పి వారిని పాఠశాల నుంచి బహిష్కరించారు. ఆ ఘటనకు సంబంధించి ఎలాంటి విచారణ చేయలేదని.. తమను ఎలాంటి వివరణ కూడా అడగలేదని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలపై కోర్టులో దావా వేశారు. తమ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కఠినమైన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. తాజాగా ఆ ఘటనపై న్యాయస్థానం తమ తీర్పును వెలువరించింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ పాఠశాలకు పెద్ద షాక్ తగిలినట్లు అయ్యింది. ఎందుకంటే ఇద్దరు విద్యార్థులకు చెరో 10 మిలియన్ల చొప్పున పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆ స్కూల్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఆ పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అయితే ఈ తీర్పులో జ్యూరీ ఏక పక్షంగా వ్యవహరించిందని.. తమకు అస్సలు న్యాయం జరగలేదని ఆరోపించింది. అలాగే ఈ తీర్పును సవాలు చేసేందుకు సిద్ధ పడ్డారు. అయితే ఈ ఘటన విషయంలో పాఠశాల యాజమాన్యంపై నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. పాఠశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ ఎందరో తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. మరి.. విద్యార్థుల ముఖాలు నల్లగా ఉన్నాయని పాఠశాల యాజమాన్యం విద్యార్థులను బహిష్కరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి